man predicted Kovind as BJP's presidential candidate సోషల్ మీడియాలో హీరో కావాలా... ఇలా చేయండీ

Man predicted kovind as bjp s presidential candidate

Ram Nath Kovind, Bihar Governor, NDA presidential candidate, Ram Nath Kovind president, Pranab Mukherjee, NDA, BJP, Ram Nath Kovind caste

Amidst the buzz surrounding the race for the 2017 Indian presidential elections, a self-proclaimed quizzer called Nitiksh Srivastava, who had accurately predicted Ram Nath Kovind, as the BJP's presidential candidate.

సోషల్ మీడియాలో హీరో అవ్వాలా... ఇలా చేయండీ

Posted: 06/21/2017 11:51 AM IST
Man predicted kovind as bjp s presidential candidate

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్న వాణిజ్య ప్రకటన చూసినప్పుడు నిజమే కదా అనుకుంటాం.. కానీ ఐడియానే కాదు అభిప్రాయం కూడా ఒక్కోసారి మనం ఎవరమన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. అప్పటి వరకు మీకు మీ స్నేహితులకు మాత్రమే తెలిసిన మీకు.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రశంసల వర్షం కురిస్తే.. జీవితంలో ఏదో సాధించేసిన తృప్తి కలుగుతుంది. అలాంటి ప్రశంసలకు కేంద్రబిందువుగా నిలిచారు నితిక్ష శ్రీవాస్తవ అలియాస్ లలిత్ మిశ్రా.
 
బీజేపి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలిపిదే బాగుంటుందన్న విషయంలో తలమునకలై అలోచిస్తున్న క్రమంలో ఈ శ్రీవాస్తవ మాత్రం బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ మాత్రమే ఆ ఆ అత్యున్నత పదవికి సముచితుడని తేల్చాశారు. ఆయనను బరిలో నిలిపితే బాగుంటుందని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. అది కూడా అసలు ఆయన పేరును కనీసం బీజేపి వర్గాలు పరిగణలోకి తీసుకోకముందే ఈ విషయాన్ని చెప్పశాడు. ఇక బీజేపి ప్రకటనలో అది నిజమని తేలిపోవడంతో శ్రీవాస్తవ.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాడు.

అయితే ఇతను ఎవరికి రామ్ నాథ్ కోవింద్ ను పరిగణలోకి తీసుకోమ్మని చెప్పాడు.. ఎక్కడ చెప్పాడు అన్న విషయాలు తెలుసుకోవాలని వుంది కదూ..? జూన్ 15న జాతీయ మీడియాకు చెందిన ఓ సంస్థ ‘‘బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు?’’ ప్రశ్నతో ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించింది. ఇందులో ఆప్షన్లుగా ఎవరి పేర్లు సూచించలేదు. అందరూ ఊహించినట్లుగానే తెరమీదకు వచ్చిన అనేక పేర్లను బీజేపి నేతల పేర్లను పలువురు తమ అప్షన్ గా పొందుపర్చారు. వారిలో సుష్మా సర్వారాజ్, రాజ్ నాథ్, వెంకయ్యనాయుడు ఇలా చాలా మంది పేర్లు వున్నాయి.

అయితే నితిక్ష శ్రీవాస్తవ అలియాస్ లలిత్ మిశ్రా అనే వ్యక్తి మాత్రం ఆ పోల్‌కు సమాధానంగా ‘‘నా ఉద్దేశం ప్రకారం బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌కు ఆ అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు. అనూహ్యంగా సోమవారం బీజేపీ చీఫ్ అమిత్ షా బీజేపీ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించారు. అంతే.. మిశ్రా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. వందలాదిమంది ఆయనను అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కొందరు ట్విటరాటీలు మిశ్రాను స్టాక్ మార్కెట్‌లో  పెట్టుబడి పెట్టాలని సూచిస్తుండగా, మరికొందరు ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఆడితే మిశ్రా తప్పకుండా గెలుచుకుంటాడని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Nath Kovind  Bihar Governor  NDA presidential candidate  NDA  BJP  

Other Articles