Nagam Janardhan Reddy Fires on KCR in Land Scam

Kcr lack clarity on land scam

Nagam Janardhan Reddy, Nagam Janardhan Reddy KCR, KCR Land Scam, Telangana Land Scam, KCR Land Scam Culprits, KCR Nagam Land Scam, Land Scam, Land Grabbing Telangana Leaders, CBI Inquiry Land Scam

BJP Leader Nagam Janardhan Reddy raised questions in Crores of Land Scam, Why KCR not encourage CBI inquiry on Land Scam.

కేసీఆర్ కే క్లారిటీ లేకపోతే ఎలా?

Posted: 06/19/2017 04:15 PM IST
Kcr lack clarity on land scam

అక్రమ భూ దందాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆరని చిచ్చునే రగిల్చాయి. వ్యవహారంలో ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలే ఉండటం, పైగా ఏపీ ఎమ్మెల్సీ ఇక్కడ హైదరాబాద్ లో భూ ఆక్రమణలు చేయటం, సబ్ రిజిస్ట్రార్ల కక్కుర్తితో వేల కోట్ల ప్రభుత్వ భూములు భూ బకాసురులకు అన్యాక్రాంతం చేయటం, అత్యన్నత స్థాయి విచారణకు ప్రతిపక్షాల డిమాండ్ ఇలా సాగుతూ వస్తోంది వ్యవహారం. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం విచారణ పేరిట ఓ అడుగు ముందుకేసినప్పటికీ, చిన్న చిన్న ఆరోపణలనే సీరియస్ గా తీసుకునే కేసీఆర్ మాత్రం వివరణలతో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌ రెడ్డి నిప్పులు చెరిగాడు. ఈ వ్యవహారంలో ప్రముఖంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న గోల్డ్‌స్టోన్‌ కంపెనీ, దాని యాజమాని ప్రసాద్‌ను ఇంత‌వ‌ర‌కు అరెస్ట్‌ చేయకపోవటంపై ప్రశ్నలు గుప్పించాడు. విచారణకు ఆదేశించకుండా స్టేట్ మెంట్లు ఇస్తూ కాలాయాపన చేస్తున్నాడని విమర్శించాడు. ఒక్క‌ గజం భూమి, ఒక్క పైసా పోలేదని సీఎం ఎలా నిర్ధారణకు వచ్చారని ప్రశ్నించాడు.

ఇంత పెద్ద అక్ర‌మ‌ వ్య‌వ‌హారంలో కేసీఆర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అలాగే, మతపర రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అన్న నాగం ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఇష్ట‌ం వ‌చ్చినట్లు వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డాడు. ప్రధాని మోదీ రిజర్వేషన్లకు ఒప్పుకున్నాడంటూ అబద్ధపు స్టేట్ మెంట్లు ఇస్తూనే.. మ‌రోవైపు ఒప్పుకోకపోతే పోరాటం చేస్తామంటూ స్టేట్ మెంట్లతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Nagam Janardhan Reddy  KCR  Telangana  Land Scam  

Other Articles