Kushner under FBI scrutiny in Trump Russia Links

Fbi turns its attention to jared kushner

Donald Trump, Trump SOn in Law Jared Kushner, Jared Kushner Donald Trump, Jared Kushner Russia Links, Jared Kushner FBI, Jared Kushner FBI Inquiry, Jared Kushner FBI Scrutiny, Trump Russia Links Case

Donald Trump son-in-law Jared Kushner under FBI scrutiny in Russia probe. Jared Kushner to Cooperate in Any Probe Into Meetings With Russians.

రష్యా లింకు: ట్రంప్ అల్లుడికి స్పెషల్ ట్రీట్ మెంట్

Posted: 05/26/2017 10:31 AM IST
Fbi turns its attention to jared kushner

అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) రంగంలోకి దిగటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆయన అల్లుడు, వైట్ హౌస్ సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న జారెడ్ కుష్ నర్ పై అధికారులు విచారణ ప్రారంభించేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా ప్రతినిధులు, వ్యాపారులతో కుష్ నర్ వరుస సమావేశాలు జరిపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అంతేకాదు గత డిసెంబరులో రష్యా దౌత్యాధికారి, మాస్కో నుంచి వచ్చిన ఓ బ్యాంకర్లతో కుష్ నర్ సమావేశమయ్యారన్న అంశంపై ఈ విచారణ జరుగుతోంది. మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్, ట్రంప్ ప్రచార బాధ్యతలు చూసిన మాజీ అధికారి పౌల్ మనఫోర్ట్ లతోనూ కుష్ నర్ సంప్రదింపులపై కన్నేసిన ఎఫ్బీఐ వారిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏదేమైనా కేసులో కీలక సమాచారమంతా కుష్ నర్ వద్దే ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే విచారణ మాత్రం కుష్ నర్ ను ఇబ్బంది పెట్టేలా సాగడం లేదని, అధ్యక్షుడి అల్లుడిపై విచారణ కావడంతో పూర్తి వివరాలు బయటకు పొక్కడం లేదని ఓ వైట్ హౌస్ ఉన్నతాధికారి ఉటంకించినట్లు 'ది వాషింగ్టన్ పోస్ట్' కథనాన్ని ప్రచురించింది. అయితే, ట్రంప్ ఎన్నికల్లో గెలిచేందుకు రష్యా ఏ విధంగానైనా సాయపడిందా అన్ని కోణంలోనే ప్రధాన దర్యాప్తు కొనసాగుతుందని ఎఫ్ బీఐ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Jared Kushner  Russia Links  

Other Articles