Canadian Hunter Fight with wild Bear to Survive Video Viral

Bear attacks hunter hunter somehow survives

Canadian Hunter, Canadian Hunter Black Bear Attack, Richard Wesley Attack Video, Richard Wesley Black Bear, Wild Bear Attack Man, Man Punches Black Bear, Man Fight with Wild Animal, Man Punch Black Bear, Terrific Bear Attack, Black Bear Attack Video, Canada Black Bear Attack, Bear Attack Hunter Video

Canadian Hunter Richard Wesley films terrifying moment black bear attacked him. Richard punches wild bear in the face and cruel animal ran away.

ITEMVIDEOS:ఫైట్ చేయకపోతే ప్రాణాలు పోయేవే!

Posted: 05/26/2017 08:27 AM IST
Bear attacks hunter hunter somehow survives

కెనడాలో రిచర్డ్ వెస్లీ అనే ఓ వేటగాడికి భయానక అనుభవం ఎదురైంది. ఒంటారియోలో ఫైర్‌ నది పక్కన సరదాగా వేటకు వెళ్లిన అతనికి కాస్త దూరంలో ఓ నల్ల ఎలుగుబంటి కనిపించింది. అయితే అది ఏం చేయబోదని తన పనిలో నిమగ్నమైన వెస్లీకి ఊహించని షాక్ ఎదురైంది.

జెట్ స్పీడ్ తో అతని వైపు దూసుకోచ్చి దాడి చేసింది. బాగా క్లోజ్ గా రావటంతో వణికిపోయిన అతగాడు విల్లు ఎక్కుపెట్టి భయపెట్టాలని చూశాడు. కానీ, అది బెదరకపోగా అతనిపైకి లఘించి దూకింది. వెంటనే అతను దానితో ప్రతిదాడికి దిగాడు. గట్టిగా అరుస్తూ దాన్ని భయపెట్టే యత్నం చేశాడు. చివరకు ఒక్క పిడిగుద్దు దాని ముఖం మీద కురిపించాడు. అంతే ఆ పంచ్ కు వెనక్కి తగ్గిన ఎలుగు రిచర్డ్ ను వదిలేసి పారిపోయింది. 

 

ఈ దృశ్యం అంతా అత‌డి వ‌ద్ద ఉన్న ఓ కెమెరాలో రికార్డ‌యింది. తన ప్రాణాలు ఎలాగూ పోతాయని అనుకున్నానని, కానీ భగవంతుడి దయ వల్ల బతికానని స్వల్ప గాయాలతో బయపడిన రిచర్డ్ వెస్లీ చెబుతున్నాడు. ఈ వీడియోను 22వ తేదీ నెట్ లో అప్ లోడ్ చేయగా అప్పుడే మిలియన్ వ్యూవ్స్ దాటేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Canada  Black Bear  Hunter  Attack Video  

Other Articles