Sania Mirza Trolled in Twitter for Promotional Tweet

Sania trolled in twitter for wrong post

Sania Mirza, Sania Mirza One Plus 3T, Sania Troll, One Plus 3T Sania mirza, Sania Mirza Apple iPhone, iPhone One Plus Brans, Sania Promotional Tweet Troll, Sania Mirza Twitter Troll

Sania Mirza promotes One Plus 3T, using her iPhone; gets trolled on Twitter.

సానియా అలా అడ్డంగా బుక్కయిపోయింది

Posted: 05/20/2017 12:49 PM IST
Sania trolled in twitter for wrong post

సోషల్ మీడియాలో పోస్టులు ఎగబడి పోయి పెట్టడమే కాదు.. తేడా వస్తే చిన్న చిన్న పాయింట్లను కూడా దొరకబుచ్చుకుని ఆడేసుకునే జనాలు ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి. అతితో చాలా మంది సెలబ్రిటీలు గతంలో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాదీ టెన్నిస్ సెన్సేషన్ సానియా విషయంలో కూడా ఇలాంటి విషయమే ఒకటి జరిగింది.

వన్ ఫ్లస్ మొబైల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా మీర్జా అందులోని 3టీ మొబైల్ కి ప్రచార బాధ్యతలను తీసుకుంది.అందులో భాగంగా తాను మూడు నెలల నుంచి అదే ఫోన్ ను వాడుతున్నానని, ఎంతో సౌకర్యవంతంగా ఫీలవుతున్నానంటూ ఓ ట్వీట్ ను ఉంచింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పండింది. సానియా వాడేది ఐఫోన్ కావటంతో ట్విట్టర్ లో ట్వీట్ కింద ఆ విషయం పోస్టు అయ్యి సానియా పరువు కాస్త పోయింది.

వెంటనే నాలుక కరుచుకున్న సానియా ఆ ట్వీట్ ను డిలేట్ చేసేసింది. కానీ, ఫోన్ కన్నా స్మార్ట్ అయిన యూజర్లు మాత్రం ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మరీ జరిగిన దానిపై రీ ట్వీట్ చేస్తూ సానియాను ట్రోల్ చేసేస్తున్నారు. ఎంతో ఆటలో తోపైనా ఇలాంటి విషయంలో ముందు వెనక ఆలోచించకుండా ఆవేశపడితే పోయేది తన పరువే అని సానియా గుర్తించేలోపే మొత్తం డ్యామేజ్ జరిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  One Plus Phone  Apple iPhone Tweet  

Other Articles