Motorcyclist in China survives fiery crash with truck ఘోర ప్రమాదం.. కానీ ప్రాణనష్టం లేదు.

Driver rescues motorcyclist as truck goes up in flames after crash

Driver rescues motorcyclist, Motorcyclist survives fiery crash with truck, motorcycle crashes truck, motorcycle crash in nanchang, motorcycle, bikest, truck, driver, survive, accident, Nanchang, China

The quick reaction of a truck driver and his companions saved the life of a motorcyclist who crashed into their dump truck that caught fire in Nanchang, China.

ITEMVIDEOS: ఘోర ప్రమాదం.. బైకిస్టు ప్రాణాలను కాపాడిన లారీ డ్రైవర్..!

Posted: 05/13/2017 11:07 AM IST
Driver rescues motorcyclist as truck goes up in flames after crash

మహారాష్ట్రంలోని బీడ్ జిల్లాలో ప్రమాదానికి గురై అసప్మారక స్థితిలోకి జారుకున్న బైకిస్టు అకస్మాత్తుగా మంటలంటుకుని సజీవదహనం అవుతున్నా.. ఆ ఘటనను చూస్తూ వెళ్లిపోతున్న వాహనదారులు కనీసం తమ వాహనాలను అపడానికి కూడా విముఖత వ్యక్తం చేశారు. ఇక కొందరు అక్కడికి వచ్చినా అతన్ని అదుకునే చర్యలకు పూనుకోకుండా.. సెల్పీలు, ఫోటోలు, వీడియోలకు మాత్రమే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ అదే చైనాలోని ఇందుకు పూర్తి భిన్నంగా ఘటన చోటుచేసుకుంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ బైకిస్టు ప్రాణాలను కాపాడారు.

సజీవదహనం అయ్యే వ్యక్తిని క్షణాల్లో స్పందించిన ట్రక్కు డ్రైవర్ సహా అందులోని వ్యక్తి కాపాడారు. తమ వాహనాన్ని వచ్చి ఢీకొన్న వ్యక్తికి గాయాలైతే.. వాడిపై విరుచుకుపడే వ్యక్తులను మనం నిత్యం చూస్తుంటాం. కానీ అలా కాకుండా మానవత్వం పరమళించిన ట్రక్కు డ్రైవర్ తమ ప్రాణాలను కాపాడుకున్న తరువాత.. వెంటనే స్పందించి మంటల్లో చిక్కుకున్న బైకిస్టు ప్రాణాలను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఘ‌ట‌న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయగా  అది కాస్తా వైరల్ గా మారింది. ఏకంగా లక్షల మంది ఇప్పటికే దీనిని వీక్షించారు.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌ నాన్‌చాంగ్‌లో ఓ కూడలి వద్ద  రోడ్డుపై నుంచి మెల్లిగా వెళుతున్న ఓ ట్రక్‌ను బైక్‌పై వేగంగా వ‌చ్చిన ఓ వ్య‌క్తి అదుపు తప్పి ఢీకొన్నాడు. బైక్ నేరుగా ట్రక్కుకు దిగువభాగంలో ఉన్న ఆయిల్‌ ట్యాంక్‌కు గ‌ట్టిగా త‌గ‌ల‌డంతో వెంట‌నే మంటలు అంటుకున్నాయి. దీనిని గమనించిన ట్రక్కులోని డ్రైవర్ సహా మిగిలిన వ్యక్తులు. హుటాహుటిన ట్రక్కు దిగిపోయారు. ప్రమాదానికి గురైన బైకిస్టు కూడా ఆ మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో ట్రక్కు డ్రైవర్ తన ప్రాణాలను పనంగా పెట్టి.. బైకిస్టును మంటల నుంచి పక్కకు తీసుకువచ్చాడు. అతడ్ని అంటుకున్న మంటలను అర్పేశాడు. ఇంతలో మంటలు తీవ్రస్థాయికి చేరుకోగా, బైకిస్టును అక్కడి నుంచి శ్రమపడి రోడ్డు పక్కకు తీసుకువచ్చేందుకు త్రీవంగా కష్టపడ్డాడు. ఈ కష్టం ఎలా వుందో మీరే చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Motorcycle  bikest  truck  driver  survive  accident  Nanchang  China  

Other Articles