Maid found hanging in film director's house ప్రముఖ దర్శకుడి ఇంట్లో యువతి ఆత్మహత్య

Maid found dead at tollywood director s house

Crime in Hyderabad, crime in Tollywood, crime in tollywood director house, maid found dead in directors house, crime in jubilee hills, crime in Kodandarami Reddy house, director, kodandarami reddy, maid, Jubilee Hills, tollywood

A 19-year-old domestic help working at Tollywood director Kodandarami Reddy's house at Jubilee Hills has ended her life by hanging.

ప్రముఖ దర్శకుడి ఇంట్లో యువతి ఆత్మహత్య

Posted: 05/07/2017 12:11 PM IST
Maid found dead at tollywood director s house

టాలీవుడ్‌ ప్రముఖ సీనియర్‌ డైరెక్టర్‌ కోదండరామి రెడ్డి ఇంట్లో విషాధం చోటుచేసుకుంది. దర్శకుడి ఇంట్లో పనిచేసే ఓ పనమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ సహా తెలుగు రాష్టాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కట్టమూరుకు చెందిన జయ అనే యువతి దర్శకులు కోదండరామి రెడ్డి ఇంట్లో గత కొన్ని నెలలుగా ఇంటి పనులు చేస్తుంది. అయితే అమె అకస్మికంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు దర్శకుడికి సమాచారం అందించడంతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.70లోని కోదండరామి రెడ్డి ఇంటికి చేరుకుని ఘటనా స్థలంతో పాటుగా మృతదేహాన్ని పరిశీలించారు. జయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా భావించి జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కొంత కాలం కిందట ఊర్లో ఉన్న తల్లి నాగమణి కూడా హైదరాబాద్‌కు వచ్చి స్థానికంగానే ఓ ఇంట్లో పనికి కుదిరింది. తన పెళ్లి చేసేందుకు తల్లి కూడా ఇంటింటికి తిరిగి పనిచేస్తుండడాన్ని జయశ్రీ తట్టుకోలేకపోయింది. ఈ బాధలన్నీ తనవల్లేనని, తానే లేకుండా పోతే తల్లికి ఈ కష్టాలు ఉండవని భావించిన జయశ్రీ శనివారం ఉదయం సర్వెంట్‌ క్వార్టర్స్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director  kodandarami reddy  maid  Jubilee Hills  tollywood  Crime in Hyderabad  

Other Articles