Free WiFi in Mumbai being used for Porn Only

30000 people using mumbai s free wifi daily for porn

Mumbai Free WiFi, Free WiFi Porn, Maharashtra Information Technology Porn Sites, Porn Sites Not Control, Free WiFi Porn Only, Porn Sites, Porn Sites WiFi, Porn Railway Stations, 30000 People Porn Sites

Mumbai's Free WiFi 'hot'spots. Being used for browsing porn by 30000 people. Maharashtra Information Technology (IT) department says can't stop people.

ప్రీ వైఫై.. పోర్న్... కంట్రోల్ కావట్లేదు!

Posted: 05/06/2017 09:22 AM IST
30000 people using mumbai s free wifi daily for porn

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన ఫ్రీ వైఫైతో అభివృద్ధి, మరోవైపు ఓటు బ్యాంకింగ్ రాబట్టేందుకు ప్రభుత్వాలు ఎగబడిపోతున్నాయి. ముఖ్యంగా నోట్ల బ్యాన్ తర్వాత ఇంటర్నెట్ అవసరం బాగా పెరిగిపోతుండటంతో ఆ సౌకర్యాన్ని మరింత విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్రీ వైఫై అన్న మాట వినిపించని రాష్ట్రం లేకుండా పోయింది. అయితే. అభివృద్ధి కోసం వాడాల్సిన టెక్నాలజీని అశ్లీలత కోసం కొందరు వాడేయటం మాత్రం మరీ దారుణం.

వాణిజ్య రాజధాని ముంబయి నగరం కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. సరిగ్గా స్థానిక ఎన్నికలకు మూడు నెలల ముందు అక్కడ 510 ప్రాంతాల్లో ఫ్రీ వైఫై స్పాట్ లు ఏర్పాటు చేశారు. ఆపై మరో 75 కూడా తోడవ్వటంతో మొత్తం 585 కి ఆ సంఖ్య చేరుకుంది. అయితే దీని వాడకం మాత్రం మరోలా ఉంది. ప్రతీ మూడు లక్షల మందిలో పది శాతం అంటే 30,000 మంది కేవలం పోర్న్ సైట్ల కోసమే దీనిని వాడుతున్నారంట.

మహారాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీకే గౌతమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటికే కొన్ని పోర్న్ సైట్స్ ను బ్లాక్ చేస్తున్నప్పటికీ కొత్త కొత్త డొమైన్ పేర్లతో అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయని ఆయన చెబుతున్నాడు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ప్రజలు అశ్లీలతనే చూడాలన్న ఉద్దేశంతో బలంగా ఉన్నారు. అలాంటప్పుడు ఎంత చేసినా వారిని నిలువరించలేం అని ఆయన తేల్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Free WiFi Hot Spots  Porn Sites  

Other Articles