American Airlines employee challenges passenger to FIGHT చంటిపిల్లల తల్లిపై అమెరికన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది దాడి..

American airlines suspends worker after altercation seen on video

United Airlines, American Airlines, Airline Altercation, David Dao, aircraft passengers, san francisco international airport, flight attendant, crew members

American Airlines has suspended an employee after a video showed an altercation on one of its planes involving crew members, several passengers and a crying woman carrying a young child.

ITEMVIDEOS: చంటిపిల్లల తల్లిపై అమెరికన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది దాడి..

Posted: 04/22/2017 07:54 PM IST
American airlines suspends worker after altercation seen on video

ప్రమాణికులు చెల్లించే డబ్బు నుంచే తాము జీతాలు తీసుకుంటున్నామని, అందుచేత వారే తమకు దైవసమానులగా చూడాలి, అలా కానీ పక్షంలో కనీసం వారి పట్లు మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తే చాటు అంటున్నారు కొందరు. ఇటీవల ఓ విదేశీ ఎయిర్ లైన్స్ చైనాకు చెందిన డాక్డర్ ను విమానం నుంచి లాగి కిందకు నెట్టివేసి.. తమ చర్యను సమర్థించుకున్న విమానయాస సంస్థ ఎట్టకేలకు దిగివచ్చి సదరు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పి.. తమకు వచ్చిన అప్రతిష్టను రూపుమాకునే చర్యకు దిగిన ఘటన తాలుకూ భాదను విమానయాన ప్రయాణికులు మర్చిపోకముందే మరోమారు అలాంటి చర్యకే పాల్పడింది మరో విమానయాన సంస్థ.

ప్రమాణికులతో అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరు ఆ కంపెనీల‌కే చెడ్డ‌పేరు తెచ్చిపెడుతున్నా విమానయన సిబ్బందిలో కానీ వాటి యాజమాన్య సంస్థల్లో కాని ఏ మాత్రం మార్పు కనబడటం లేదు. శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెరికన్ ఎయిర్‌లైన్స్ లో తాజాగా ఓ సిబ్బంది ప్ర‌యాణికురాలితో ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రికీ ఆగ్ర‌హం తెప్పిస్తోంది. నిన్న‌ రాత్రి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి విమానం ఎక్కింది. అయితే, త‌న చిన్న పాప‌ను ఆమె స్ట్రోలర్‌లో కూర్చోపెట్టుకుంది. దీంతో ఫ్లైట్‌ అటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆమెతో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు.

నెమ్మదిగా మాట్లాడేందుకు బదులు అమెపై బిగ్గరగా అరుస్తూ నానా హంగామా కుదుర్చుకున్నాడు. అంతటితో అగకుండా అడవారన్న ఇంకితాన్ని మర్చిపోయి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెకు మద్దతు ప్రకటించి మాట్లాడిన మరో ప్రయాణికుడిని కూడా కొట్టాడు. త‌ర్వాత ఆ మహిళని, పిల్లల్ని విమానం నుంచి దించేశాడు. ఆ దృశ్యాల‌ను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై స్పందించిన‌ ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పి, మ‌హిళ‌తో అలా ప్ర‌వ‌ర్తించిన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొల‌గించింది. స‌ద‌రు ప్ర‌యాణికు‌రాలికి ఫస్ట్‌క్లాస్‌లో సీట్‌ కేటాయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles