వద్దంటున్నా విష వాయువులతో విరుచుకుపడ్డారు... 100 మంది మృతి? | Dozens Dead in Syria Chemical Attack.

Suspected gas attack in syria reportedly kills dozens

Syria, Syria Chemical Attack, Toxic Gas Attack, Chemical Weapons Syria, UN Chemical Weapons Treaty, UN Draft Condemning Toxic Gas Attack, Khan Sheikhoun Chemical Gas Attack

Chemical attack kills dozens in Syria as victims foam at the mouth, activists say. Britain, France, US Present UN Draft Resolution Condemning Toxic gas attack.

కెమికల్స్ తో దాడి... 58 మంది మృతి

Posted: 04/05/2017 08:00 AM IST
Suspected gas attack in syria reportedly kills dozens

సిరియా అంతర్యుద్ధం రాను రాను తీవ్ర నష్టాన్ని మిగులుస్తోంది. ఐఎస్ఐఎస్, సిరియా రెబల్స్ మధ్య భీకరయుద్ధంలో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మంగళవారం విషవాయువులతో జరిపిన వైమానిక దాడుల్లో 58 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌ పరిధిలోగల ఖాన్‌ షేఖున్‌ ప్రాంతంలో సైన్యం ప్రమాదకరమైన రసాయన ఆయుధాలతో దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడిలో 11 మంది చిన్నారులు సహా 58 మంది మృత్యువాత పడ్డారని సమాచారం.

అయితే చనిపోయిన వారి సంఖ్య వంద దాకా ఉండొచ్చని, ఒప్పందాలపై సంతకం చేశాక కూడా సిరియా విష వాయువులతో దాడులు చేస్తోందని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల సంఘం ఆరోపిస్తోంది. అయితే తాము రసాయన ఆయుధాలను వినియోగించలేదని, భవిష్యత్తులో కూడా తాము ఉపయోగించబోమని సిరియా వాదిస్తోంది. దీంతో ఆ విమానాలు సిరియా సైన్యానివా? లేక రష్యాకు చెందినవా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు ఘటనపై అమెరికా సహా పలు దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ గద్దె దిగిపోవాల్సిందేనని ట్రంప్ డిమాండ్ కూడా చేస్తున్నాడు. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని, కానీ అందుకు రసాయన ఆయుధాలు సరైన విధానం కాదని పలువురు మానవహక్కుల ప్రతినిధులు పేర్కొంటున్నారు. అమెరికా సైనిక చర్య నుంచి బయటపడేందుకుగాను సిరియా ప్రభుత్వం 2013లో రసాయన ఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకం చేసింది. అయినా అనధికారికంగా రసాయన ఆయుధాలను సిరియా ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

2014,15లలో కనీసం మూడు పర్యాయాలు క్లోరిన్‌ రసాయనంతో రెబెల్‌ ఆధీనంలోని ప్రాంతాలపై సిరియా ప్రభుత్వం దాడి చేసినట్టు ఐక్యరాజ్యసమితి జరిపిన విచారణలో తేలింది. అసద్‌ విధేయ సైనిక బలగాలు హమా ప్రావిన్స్‌ ను ఐఎస్ఐఎస్ చెర నుంచి విడిపించేందుకు రసాయన ఆయుధాలతో గత గురువారం దాడి జరిపాయి కూడా. మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్ లు కూడా సిరియాను, వారికి మద్ధతు ఇస్తున్న వారి వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syria  Chemical Attack  Toxic Gas  

Other Articles

Today on Telugu Wishesh