కల్లు కుండలోకి దూరి మరీ సిప్పే సిన నాగుపాము.. ఎందుకో చదవండి | Thirsty snake calmly drink palm wine.

Snake drink palm wine due to thirsty

Snake Palm Wine, Snake Kallu, Sanke Drink Kallu. Snake Toddy Tree, Snake sip Kallu, Snake Sip Palm Wine, Snake Telangana Village, Snake Drinking Alcohol, Palm Wine Tree Snake, Snake Tree Drink, Thirsty Snake Tree

Snake Peacefully Sips palm wine(Kallu) From A pot on tree In Telangana Village.

దాహానికి తట్టుకోలేక కుండలోకి దూరి మరీ...

Posted: 04/03/2017 10:34 AM IST
Snake drink palm wine due to thirsty

అసలు వేసవి ప్రారంభం కాకముందే కొసరు ఎండలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లలాడిపోతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకెలా ఉండబోతుందోనని భయంతో ఇంటికి అంకితమైపోతున్న వారికి అక్కడా చుక్కలే కనిపిస్తున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇక మూగ జీవాల పరిస్థితి అయితే వర్ణనాతీతం. మొన్నామధ్యే కర్ణాటకలో ఓ త్రాచుపాము జనావాసాల్లోకి రావటం, దానికి బాటిల్ తో నీరు పట్టించటం చూశాం. కానీ, ఇక్కడో నాగరాజు గారు మాత్రం ఏకంగా కుండలోకి దూరి మరీ తాగేస్తున్నారు.

అది అలాంటి ఇలాంటి కుండ కాదు. తాటిచెట్టు మీద కల్లు కోసం కట్టిన కుండ. దాహంతో డీహైడ్రేషన్ కు గురైన ఓ నాగుపాము చెట్టు మీదకు ఎక్కి అక్కడున్న కుండలోని కల్లుని హాయిగా తాగి దప్పిక తీర్చుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ స్థానికుడు, ఆ దృశ్యాన్ని చూసి తన మొబైల్ తో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

దాహార్తితో జనావాసాలకు వచ్చే జంతువుల కోసం ఇప్పటికే కొన్ని గ్రామ శివార్లలో స్వచ్ఛంద సంస్థలు కృతిమ నీటి కొలనులను, ట్యాంకర్లతో అడవులల్లో ప్రత్యేక  ఏర్పాట్లను చేస్తున్నాయి కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Snake  Toddy Tree  Drink Palm Wine  

Other Articles