యూపీ పాకిస్థాన్ కాకుండా చేస్తున్నాడా? | Adityanath has saved UP from becoming Pakistan.

Sadhvi prachi on yogi adityanath selection as up cm

Sadhvi Prachi, Uttar Pradesh CM, Yogi Adityanath, Yogi Adityanath Sadhvi Prachi, Sadhvi Prachi Praise Yogi, Sadhvi Prachi Pakistan, Yogi Adityanath UP Pakistan, Kerala BJP, Kerala BJP Beef, Kerala BJP Controversial Comments, Kerala BJP Cow Slaughter

BJP Leader Sadhvi Prachi said CM Yogi Adityanath prevented Uttar Pradesh turning into another Pakistan. Kerala BJP fine with beef in absence of any ban. The party men says the issue comes into play when there is a ban.

థాంక్స్... మరో పాక్ కాకుండా కాపాడారు

Posted: 04/03/2017 08:15 AM IST
Sadhvi prachi on yogi adityanath selection as up cm

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ చూపిస్తున్న దూకుడు దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తోంది. మహిళ భద్రత, సమస్య సత్వర పరిష్కారం, కీలకమైన విద్యా వ్యవస్థ అవినీతి నిర్మూలనకు కృషి తదితర అంశాలు సత్పలితాలనే ఇస్తున్నాయి. అందుకే ఆయన్ను సీఎం చేసి బీజేపీ చాలా గొప్ప పనే చేసిందని అంటున్నాడు హిందుత్వ నేత సాధ్వి ప్రాచీ.

యోగి పగ్గాలు చేపట్టి మంచి పని చేశారని, రాష్ట్రం మరో పాకిస్థాన్ కాకుండా కాపాడారని ఈ వివాదాస్పద నేత ప్రశంసలు కురిపించింది ‘‘యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి ప్రజల్లో సంతోషం నింపడమే కాదు.. యూపీని మరో పాకిస్థాన్ కాకుండా కాపాడారు’’ అని సాధ్వి పేర్కొంది. గత ప్రభుత్వాలు చేపట్టిన పలు పనులపై దర్యాప్తు చేపడతామని, వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఆమె అన్నారు.

బహుశా ఇది వారికి (సమాజ్‌వాదీ పార్టీ)కి నిద్రలేని రాత్రులను మిగల్చ వచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక మరో ప్రశ్నకు బదులిస్తూ బీహార్ మాదిరిగానే, యూపీలోనూ మద్య నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేసింది. యూపీ సీఎం రేసులో తొలుత ఈమె పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే.

బీఫ్ పై బీజేపీ నేతల కామెంట్లు...

గోమాంసం విక్రయాలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న వేళ, కేరళలోని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలమే రేపుతున్నాయి. మలప్పురం లోక్ సభ నియోజకవర్గానికి కొద్దిరోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎన్.శ్రీప్రకాశ్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... తనను ఎన్నికల్లో గెలిపిస్తే స్వచ్ఛమైన గోమాంసం సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపాడు.

కాగా, ఈ వ్యాఖ్యలు రాజకీయంగా విమర్శలకు దారి తీశాయి. అయితే ప్రకాశ్ కు మద్ధతు తెలుపుతూ పార్టీ జనరల్ సెక్రటరీ ఎం టీ రమేష్ కూడా ఇలాంటి కామెంట్లే చేయటం గమనార్హం. కేరళలో ప్రజలు గోమాంసం తినాలనుకుంటే దానికి బీజేపీ ఎలాంటి అడ్డుచెప్పదు, అయినా నిషేధం అక్రమ గోశాలలపైనే కానీ, మాంసం పైన కాదు కదా అని రమేష్ తెలిపాడు. దీంతో పలువురు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sadhvi Prachi  Uttar Pradesh  CM Yogi Adityanath  Pakistan  Kerala BJP  Beef Ban  

Other Articles