జాత్యాహాంకారంపై సిక్కు యువకుడి వినూత్న నిరసన This Sikh man has a unique way to protest hate crimes in the US!

This sikh man has a unique way to protest hate crimes in the us

Times Square, Indian American, racial attack, hate crime, army veterans, white supremacy, New York City, 9/11, United States of America, Sikh, racism, Black Lives Matter, turban

In a time when racial hatred is at its peak in America, Angad Singh, a 23-year-old Indian-American, bravely spoke against it in the most unique way.

ITEMVIDEOS: జాత్యాహాంకారంపై సిక్కు యువకుడి వినూత్న నిరసన

Posted: 03/30/2017 06:39 PM IST
This sikh man has a unique way to protest hate crimes in the us

అగ్రరాజ్యం అమెరికాలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే మినీ ప్రపంచాన్ని తలపించే దేశంలో ఒక్కసారిగా జాతివిద్వేషం బుసలు కొట్టడం ప్రారంభమైంది. ఈ విద్వేషాలతో రగలిపోతున్న అమెరీకన్లు ఇతర దేశాల వారిపై దారుణాలకు ఒడిగడుతుండటాన్ని జీర్ణంచుకోలేని ఓ భారతీయ సిక్కు యువకుడు.. అంగద్ సింగ్ (23) వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద సాహసమే చేశాడు. మీరు మీ పక్కనున్న ఇతర దేశీయుల గురించి తెలుసుకోవాలంటూ సూచిస్తూ నినదించాడు.

{youtube}v=H506laefXW0|620|400|1{/youtube


మీలో రగులుతున్న అభద్రతాభావంతో.. అమాయకులు అసువులు వాస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలో పలువురు అమెరీక్ల అభిమానాన్ని కూడా సంపాదించాడు. న్యూయార్క్ లోని టైమ్స్ స్వ్కేర్ జాత్యహంకారం పెరిగిపోతున్న దశలో అమెరికన్లకు ప్రేమ గురించి చెప్పాడు. న్యూయార్క్ లోని టైమ్స్ స్వేర్ వద్ద బిగ్గరగా మాట్లాడుతూ, జాతి విద్వేషం వద్దని నినదించాడు. మార్చి 20న తిమోతి కాఫ్‌ మన్‌ అనే వ్యక్తిని ఓ శ్వేతజాతీయుడు కత్తితో పొడిచి చంపేశాడని అన్నాడు. తాను ముస్లింను కాదని, సిక్కునని చెప్పుకోచ్చాడు.

ప్రతీరోజు తలపాగా కట్టుకునేప్పుడు తనలో అందోళన చెలరేగుతుందని,  అయినా తలపాగా కట్టుకోవడానికి సందేహించనని స్పష్టం చేశాడు. సిక్కుల తలపాగా ఎలా ఉంటుందో చూపేందుకు పబ్లిక్ గా ఆందరి ఎదుట కట్టుకుని చూపించాడు. విద్వేషంతో టెర్రరిజాన్ని జయించలేమని అన్నాడు. అదే సమయంలో ప్రేమతో టెర్రరిజాన్ని జయించవచ్చని అంగద్ సింగ్ తెలిపాడు. అంగద్ చర్యను పలువురు అభినందించారు. మరికొందరు హగ్ ఇచ్చి తమ మద్దతు తెలిపారు. ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయగా, అదికాస్తా వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles