ఫ్లాష్: అమెరికాలో ఇద్దరు తెలుగువారి హత్య... ఎలా జరిగింది? | Two telugu people murder in America.

Telugu people murder in america

America, Telugu People Murder America, Narra Hanumantha Rao, Narra Hanumantha Rao America, America Telugu People Murder, Telugu Family Murder America, Prakasham Family Murder America

Two people mudered in America. Narra Hanumantha Rao family members suspicious death.

ITEMVIDEOS:అమెరికాలో ఇద్దరు తెలుగువారి దారుణ హత్య

Posted: 03/24/2017 09:16 AM IST
Telugu people murder in america

అమెరికాలో తెలుగు వారు దారుణ హత్యకు గురి కావటం తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు కుటుంబ సభ్యులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఆఫీస్ ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన లోపలికి వెళ్లి చూసేసరికి భార్య, కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నారు. నర్రా కుటుంబం ప్రకాశం జిల్లా పరుచురు తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందింది. 

గత రాత్రి బర్లింగ్టన్ లో అత్యంత కిరాతకంగా దుండగులు వీరిని హతమార్చినట్లు తెలుస్తోంది. ఫెడరల్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, హనుమంతరావు, ఆయన భార్య శశికళ (40) సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం కాగా, కుమారుడు హనీష్ సాయి (7) ఉన్నాడు. 

 

ఈ ప్రాంతంలో హనుమంతరావుకు ఎవరూ శత్రువులు లేరని, ఆయన అందరితో కలుపుగోలుగా ఉంటారని, ఆయన భార్య చాలా మంచి వ్యక్తని ఇరుగు పొరుగు వారు తెలిపారు. ఇంట్లోని తల్లీ కొడుకులను ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలియడం లేదని అన్నారు. ఇది జాతి వివక్ష కారణంగా జరిగిన హత్యలనే అనుమానిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఘటనపై తానా ప్రతినిధులను ఏపీ ప్రభుత్వం ఆరాతీస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Telugu People Murder  Narra Hanumantha Rao  

Other Articles

Today on Telugu Wishesh