వైఎస్ జగన్ బాలయ్య బిగ్ ఫ్యాన్... అసెంబ్లీలో హాట్ టాపిక్ | YS Jagan Goes in All Paise of Balakrishna.

Ys jagan praised hundupuram mla balayya

YS Jagan, Jagan Balayya, Kadiri Babu Balayya, MLA Balakrishna, Balakrishna YS Jaganmohanreddy, Jagan Big Fan of Balayya, Balayya Assembly Fan, Jagan Praise TDP MLA, Hindupur MLA, TDP MLA Balakrishna, Balayya Jagan, Balayya Big Fan in Assembly

YSRCP Chief YS Jagan was praising Balayya that Hindupur MLA Balakrishna is a good person among the TDP MLA’s and that he wouldn’t foul mouth or criticize anyone. TDP MLC, Payyavula Keshav has asked Baburao if what Jagan really said that, for which Baburao agreed and answered a yes.

బాలయ్య ఖుషీ అయ్యే మాట అన్న జగన్

Posted: 03/23/2017 08:01 AM IST
Ys jagan praised hundupuram mla balayya

తన నియోజకవర్గం పనులను చక్కదిద్దుకోవటంతోపాటు ఏపీ పాలిటిక్స్‌లోనూ బాలయ్యను మొదటి నుంచే హవా చూపుతూ వస్తున్నాడు. మధ్యలో పీఏ అక్రమాలకు సంబంధించి విమర్శలు రాగానే నిర్దాక్షిణ్యంగా తీసిపడేసి తన చిత్తశుద్ధిని చూపించుకున్నాడు. అంతేకాదు మొదటి నుంచి మిగతా వాళ్లలా నోటికి దురుసు చూపించకుండా తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నాడు. ఓవైపు ఏపీలోనే కాదు,
మరోవైపు తెలంగాణ నేతల దృష్టిలో కూడా బాలయ్యకు సత్సంబంధాలే ఉన్నాయి.

అలాంటిది తెలుగుదేశం పార్టీ పేరంటేనే చిరాకుపడే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బాలయ్యను ఆకాశానికి ఎత్తేయటం ఒకింత ఆశ్చర్యమే. దీని గురించి జగన్ నోటి నుంచి నేరుగా ప్రస్తావన రాకపోయినా ఆయన సహచర ఎమ్మెల్యేతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య పిచ్చపాటి చర్చ జరిగింది. ఈ సందర్భంగా బాలయ్యపై జగన్ ఫలానా కామెంట్లు చేశాడని తెలిసిందంట. వెంటనే ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ దీనిపై కదిరి బాబూరావు ను ఆరాతీశాడు.

దానికి కదిరి సమాధానిమిస్తూ ఈ మధ్య ఫ్లైట్ లో జగన్ తో కలిసి అమరావతికి వస్తుండగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాధానమిచ్చాడు. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరికంటే బాలకృష్ణే చాలా మంచివాడని, లాబీల్లో. ప్రతిఒక్కరూ ఏదో సందర్భంలో తనను విమర్శించే వాళ్లేనని.. అయితే బాలయ్య మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదని జగన్ అన్నట్టు బాబూరావు చెప్పుకొచ్చాడు. తమ మధ్య జరిగిన సంభాషణ అసెంబ్లీ లాబీల వరకూ రావటంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడంట. అదే సమయంలో జగన్ మొదట్నుంచి బాలయ్య అభిమాని అని… గతంలో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘానికి జగన్ అధ్యక్షుడిగా వ్యవహరించాడని కదిరి చెప్పుకోచ్చాడు కూడా. అయితే ఇంతకు ముందు ఇదే అసెంబ్లీ హర్డ్ కోర్ ఫ్యాన్ బాలయ్య కాల్పుల కేసుపై కాస్త విమర్శలు చేయటం కొసమెరుపు అనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  YS Jagan  Hindupur MLA Balakrsihna  

Other Articles