సబ్సీడీ రహిత వంటగ్యాస్ ‘ధర’ పేలింది..! Non-subsidised LPG cylinder price goes up by Rs 86

Non subsidised lpg cylinder price goes up by rs 86

LPG Cylinder price, LPG, subsidised LPG, Economy, IOCL, Indian Oil, Non-subsidised LPG cylinder price, price hike of lpg, price hike of NS LPG price

Price of one cylinder of non-subsidised LPG gas has been increased by Rs 86 with effect from today, Ministry of Petroleum & Natural Gas, in a statement, said,

సబ్సీడీ రహిత వంటగ్యాస్ ‘ధర’ పేలింది..!

Posted: 03/01/2017 11:39 AM IST
Non subsidised lpg cylinder price goes up by rs 86

డీమానిటైజేషన్ (పాత పెద్దనోట్ట రద్దు) నేపథ్యంలో దాని ప్రతిఫలాలు త్వరలోనే దేశ ప్రజలకు అందిస్తామని అప్పటి వరకు వేచి వుండాలని ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు కూడా వరుస పెట్టి చెప్పారు. ఇది చాలదన్నట్లు ఇక సోషల్ మీడియాలో అయితే బీజేపి అనుకూలవర్గాలు, అనుబంధ సంస్థలు మరో అడుగు ముందుకేసి పాత పెద్దనోట్ల రద్దు తరువాత ఏం జరుగుతుంది అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపాయి.

ప్రస్తుత లీటరు ధరతో కొన్న రోజుల్లోనే రెండు లీటర్ల పెట్రోల్ వస్తుందని, ఇక గ్యాస్ సిలిండర్ ధర అమాంతంగా సబ్సీడీ ధర కన్నా తక్కువకు చేరకుంటుందని ఊదరగోడుతూ సామాజిక మాధ్యమాలలో భారీ ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. సగటు భారతీయుడు మాత్రం ఇవన్నీ జరగాలని అకాంక్షించాడు. నోట్ల రద్దు నేపథ్యంలో తాను అనేక కష్టనష్టాలకు ఓర్చి.. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మౌనంగా వున్నాడు.

అయితే డీమానిటైజేషన్ జరిగి నాలుగు మాసాలు పూర్తికావస్తుంది. కానీ ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో నోట్ల కష్టాలకు బ్రేకులు పడలేదు. వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇంకా ప్రజలను ఈ కష్టాలు వెంటాడుతున్నాయి. మునుపటి పరిస్థితికి చేరుకువడానికి ఇంకెంత కాలం పడుతుందన్న విషయాన్ని పక్కనబెడితే.. తాజాగా అనేక ఏటీయం కేంద్రాలలో నకిలీ నోట్లు, బొమ్మ నోట్లు, గాంధీ ముద్రలేని నోట్లు, సీరియల్ నెంబర్లు లేని నోట్లు దర్శనమిస్తూ ప్రజలను సరికొత్త కష్టాలకు గురిచేస్తున్నాయి.

ఈ విషయాలను పక్కనబెడితే.. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర చెప్పిన మాటలకు, చేసిన ప్రచారానికి.. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలకు మధ్య అసలు పొంతన లేకుండా పోతుంది. ధరలు తగ్గుతాయని అశించిన ప్రజలపై ధరాఘాతం పోటు పడుతుంది. అటు పలు పర్యాయాలు ఇంధన ధరలును పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా సబ్సీడీరహిత వంటగ్యాస్ సిలిండర్ల ధరను కూడా అమాంతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా తెలిపింది.

నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పీజీ గ్యాస్ ధరను రూ. 86 మేరకు పెంచుతున్నట్టు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ ధరలు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల సబ్సిడీతో సిలిండర్లు పొందుతున్న పేదలపై ఎలాంటి ప్రభావమూ ఉండదని పేర్కొంది. కాగా, ఈ మార్పుతో ఢిల్లీలో సబ్సిడీ రహిత సిలిండర్ ధర రూ. ఏడు వందల ముఫై ఏడు కానుంది. సబ్సిడీతో కూడిన సిలిండర్ ధర రూ. నాలుగు వందల ముఫై నాలుగుగా ఉండనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LPG Cylinder price  LPG  subsidised LPG  Economy  IOCL  Indian Oil  Non-subsidised LPG cylinder price  

Other Articles