ఆర్మీలోనూ మొదలైన లీకులు పరంపర.. పరీక్షలు రద్దు Army question paper leaked; test cancelled, 18 arrested

Army recruitment board question paper leaked exam cancelled

Indian Army, Question Paper Leaked, Exam paper leaked, paper leaked, Thane Police, Army Recruitment Board, defence ministry, manohar parrikar

The Indian Army today countermanded examinations in six centres in western India for some lower level posts following an alleged leak of question papers.

ఆర్మీలోనూ మొదలైన లీకులు పరంపర.. పరీక్షలు రద్దు

Posted: 02/26/2017 01:43 PM IST
Army recruitment board question paper leaked exam cancelled

క్రమశిక్షణ, కఠోర శిక్షణకు అలవాలైమైన భారత రక్షణ రంగానికి చెందిన అర్మీలో కూడా లీకుల పరంపర వెలుగుచూసింది. ఆర్మీలో పలు ఉద్యోగాల నియామకాలకు ఆదివారం నిర్వహించాల్సిన ప్రశ్నా పత్రం లీక్ అయింది. దీనికి సంబంధించి పుణె, నాగ్పూర్, నాసిక్ లకు చెందిన 300 మంది విద్యార్థులను, 18 మంది నిందితులను థానె పోలీసులు అరెస్టు చేశారు. పుణెలో ప్రశ్నా పత్రం లీక్ అయినట్టు గుర్తించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగాల నియామకాల పరీక్షలను రద్దు చేశారు.

ఈ రోజు తెల్లవారుజామున సుమారు 350మంది విద్యార్థులకు  కోచింగ్ సెంటర్లు ప్రశ్నాపత్రాన్ని అమ్మాయి. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేశారు. పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. పలు కోచింగ్ సెంటర్ల యాజమానులను, ఆర్మీ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు థానె క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నితిన్ ఠాక్రే తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం లీక్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles