‘‘శశికళే ‘అమ్మ’.. అమ్మకు వారుసులం మేమే’’ మృతిపై విచారణ జరగాలి Jaya bequeathed her properties to Deepa & me: Deepak Jayakumar

Jaya bequeathed her properties to deepa me deepak jayakumar

tamil nadu, sasikala, jayalalithaa, sasikala jayalalithaa, jayalalithaa death, Jayalalithaa, Deepak jayakumar, poyes Garden, palnisamy, legal heirs, paneer selvam, sasikala, chief minister, DMK, mk stalin, tamil nadu politics

Tamilnadu Late chief minister jayalalithaa's nephew Deepak has also opposed the leadership of AIADMK deputy general secretary Dinakaran and Venkatesh, nephews of Sasikala.

అన్నాడీఎంకేలో అగ్గిరాజేస్తున్న ‘అమ్మ’ వారసుడు

Posted: 02/24/2017 01:13 PM IST
Jaya bequeathed her properties to deepa me deepak jayakumar

తమిళనాట అధికార అన్నాడీఎంకేలో మరోమారు అగ్గి రాజుకుంటుంది. శశికళకు నమ్మకంగా వున్న జయలలిత మేనల్లుడు దీపక్‌ జయకుమార్‌ ఇప్పుడు పార్టీలో తాజాగా అగ్గి రాజేసే వ్యాఖ్యలు చేశారు. పార్టీ సినియర్ నేత పాండ్యరాజన్ తరువాత పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా దీపక్‌ కూడా గళం విప్పారు. తాను, తన సోదరి దీపా జయకుమార్‌ మాత్రమే జయలలితకు వారసులమని, పోయెస్‌ గార్డెన్  ఇంటిపై తామిద్ రికి అన్ని హక్కులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ అంత్యక్రియల సమయంలో ఆమె అన్న జయకుమార్‌ కుమారుడు దీపక్‌ అనూహ్యంగా తెరపైకి వచ్చారు.

శశికళతో కలసి జయలలిత అంత్యక్రియలు పూర్తిచేశారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. దీపక్‌ మాత్రం శశికళ వెన్నంటే ఉన్నారు. అన్ని విషయాల్లో చిన్నమ్మకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చిన ఆయన ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి చిన్నమ్మ నిర్ణయాలపై ఆక్రోశం వెళ్లగక్కారు. శశికళ సోదరి వనిత మణి కుమారుడు టీటీవీ దినకరన్ డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం ఇందుకు కారణం.

మాజీ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన దీపక్.. తన మేనత్త మరణంపై న్యాయ విచారణకు జరిపించాలని డిమాండ్‌ చేశారు. అదే తరుణంలో పార్టీ ముందుకు సరికొత్త ప్రతిపాదనను తీసుకువచ్చారు. ‘పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ,, సీఎంగా పళనిస్వామి కొనసాగాలి. ఉప ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్‌సెల్వంకు అప్పగించాలి’’ అని దీపక్‌ అన్నారు. ఇక తన మేనత్త అక్రమాస్థుల కేసులో దోషిగా తేలడంతో.. అమె తరపు తాను వందకోట్ల రూపాయల పరిహారాన్ని కట్టేందుకు కూడా సంసిద్దత వ్యక్తం చేశాడు.

అయితే తన వద్ద డబ్బు లేవని తమ అత్తకు చెందిన అస్తులను విక్రయించి.. న్యాయస్థానానికి ఫైన్ చెల్లిస్తామన్నారు. అయితే ఏ ఆస్తులను అమ్ముతానన్న విషయం తాను చెప్పలేనన్నారు. కాగా పోయిస్ గార్డెన్ మాత్రం తనకు తన సోదరి దీపకు మాత్రమే చెందుతుందని అన్నారు. శశికళ తనకు తల్లిలాంటిదేనని చెప్పుకోచ్చిన దీపక్.. అమెపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చిన శశికళ సోదరి కొడుకులు టీటీవి దినకరన్, వెంకటేష్ లు బలవంతంగా పదవులను ఇప్పించుకున్నారని కూడా అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles