పాలు.. విషం... రెండింటిలో రోజా ఏదీ? | AP CM Fires on MLA Roja.

Chandrababu naidu fires on mla roja

Andhra Pradesh CM, Chandrababu Naidu, YCP MLA Roja, Roja Chandrababu Naidu, National Women's Parliament Conference, Amaravati National Women's Parliament Conference, Roja Drama, Chandrababu Naidu Fire on Roja, Roja And Jagan

AP CM Chandrababu Naidu fire onYCP MLA Roja over drama at National Women Parliamentary Conference.

రోజా గొడవ గురించి ముందే తెలుసా?

Posted: 02/14/2017 08:03 AM IST
Chandrababu naidu fires on mla roja

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారం ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఆహ్వానం పంపి మరీ పోలీసులు అదుపులోకి తీసుకోవటమే కాదు, ఊళ్లన్నీ తిప్పి తనను ఘోరంగా అవమానించారంటూ ఏకంగా ఓ వీడియోలో నిప్పులు చెరిగింది కూడా. చాలా సేపు హైడ్రామా తర్వాత పోలీసుల వాహనం దిగి కాపాడండి అంటూ సినిమాటిక్ గా పరుగులు తీసింది.

ఇక ఈ వ్యవహారంపై విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయ్. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘గొడవ చేస్తానని ముందే చెబితే కార్యక్రమానికి ఎవరైనా అనుమతిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. వచ్చి కార్యక్రమాన్ని రసాభాస చేస్తామంటే పోలీసులు చూస్తూ కూర్చోరని పేర్కొన్నారు. కడివెడు పాలల్లో ఒక్క విషపు చుక్క చాలంటూ రోజా తీరును తప్పుబట్టారు.

స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాటల్లో ఎక్కడా తప్పులేదని, ఆయన మాటలను వక్రీకరించారని, ఇది హేయమని అన్నారు. ఇక తనకు, తన పార్టీకి మహిళలను గౌరవించే సంస్కారం తెలీదన్న కామెంట్లు చేస్తున్న వారు, మహిళా పార్లమెంటుకు అన్ని పార్టీల వారు వచ్చారని, అక్కడికి వచ్చిన ఓ వైసీపీ ఎంపీని కూడా తాను సన్మానించానన్న విషయం గమనించాలంటూ గుర్తు చేశాడు. ప్రతి శుక్రవారం బోనెక్కి, బయటకు వచ్చి తిట్టేవాళ్లు ఉండడం దురదృష్టకరమంటూ జగన్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి వాళ్లకు ఓట్లు వేసి గెలిపించడంపై ప్రజలు పునరాలోచించాలంటూ సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  AP CM Chandrababu Naidu  Amaravati  National Women Conference  

Other Articles