పాఠశాలలో బాలికలకు అర్థనగ్న కవాతు శిక్ష.. students parade skirtless in school as punishment

Students parade skirtless in school as punishment

Uttar Pradesh, Sonbhadra, Semi-nude condition, Girls’ Junior High School, Shashwati Ghosh, Meena singh, girl student semi-nude run, home work, punishment

The principal of a government school in Uttar Pradesh has been suspended for allegedly making 15 girls take off their skirts and run around the school playground as a form of punishment.

పాఠశాలలో బాలికలకు అర్థనగ్న కవాతు శిక్ష..

Posted: 02/08/2017 01:48 PM IST
Students parade skirtless in school as punishment

విద్యార్థులను సన్మార్గంలో నడిపించి వారి మనోవికాసానికి చదువులు దోహదపడేలా చేసేందుకు, ప్రపంచంలోని పలు అంశాలపై అవగాహన కల్పించేందే చదువులని.. అంతేకానీ విద్యార్థులను హింసించడం కోసం మాత్రం కాదని విద్యారంగ నిపుణులు, చైల్డ్ సైకాలజీ నిపుణులు ఇప్పటికే పలు సందర్భాలలో వెల్లడించారు. అయినా ఉపాధ్యయుల వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. విద్యార్థుల నుంచి అశించిన ఫలితాలు రాకపోవడంతో తమ అజమాయిషీకే అన్యాయం జరిగిందన్నట్టుగా భావిస్తున్నారు ఉపాధ్యయులు.

బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయకు చెందిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా వ్యవహరిస్తూ, లైంగికంగా వేదిస్తున్న అరోపణలను ఇంకా విద్యార్థి సమాజం మర్చిపోకముందే.. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సోనాభద్రలోని ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాలలో హోం వర్క్ చేయలేదని 15 మంది బాలికలకు ప్రధానోపాధ్యాయురాలు అర్దనగ్న కవాతు శిక్ష విధించింది. రాష్ట్రంలోని సన్ భద్ర పట్టణంలోని బాలికల జూనియర్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకంపై సామాజిక కార్యకర్త శాశ్వతి ఘోష్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విద్యాశాఖ అధికారులు అమెను సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే సదరు పాఠశాల 8వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థినులు హోం వర్క్ పూర్తి చేయలేదని ప్రధానోపాధ్యాయురాలు మీనాసింగ్ పాఠశాల ఆవరణలో అర్దనగ్నంగా రెండుగంటల పాటు కవాతు శిక్ష విధించారు. అర్దనగ్న కవాతు నిర్వహిస్తుండగా బాలిక వీడియోను తీసిన ప్రధానోపాధ్యాయురాలు ఇకముందు హోం వర్క్ పూర్తిచేయకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాకు లీక్ చేస్తానని కూడా హెచ్చరించారు. బాలిక పట్ల ప్రధానోపాధ్యాయురాలు వ్యవహరించిన తీరు మానవత్వానికే మచ్చగా మిగిలిందని బాలిక తల్లిదండ్రులు జిల్లాకలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టరు తక్షణం ప్రధానోపాధ్యాయురాలు మీనాసింగ్ ను సస్పెండ్ చేసి ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles