ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భూకంపం.. రంగంలోకి దిగిన సైన్యం... అలర్ట్ | A 5.8 magnitude earthquake hits North India and Delhi NCR.

5 8 magnitude earthquake hits north india

Earthquake, North India, North India Earthquake, Delhi Earthquake, Punjab Earthquake, Uttarkhand Earthquake, Rajnath Singh Earthquake, Modi Earthquake, Jolts Uttarakhand

Earthquake measuring 5.6 hits parts of north India. Jolts Delhi, Punjab, Uttarkhand. PM speaks to officials to take stock of situation, NDRF put on high alert.

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భూకంపం

Posted: 02/07/2017 08:11 AM IST
5 8 magnitude earthquake hits north india

ఉత్తర భారతదేశం మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం రాత్రి భూ ప్రకంపనలు పలు రాష్ట్రాల్లో ప్రభావం చూపాయి. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదలడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. చండీగఢ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 10:30 గంటల సమయంలో భూమి కంపించింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా కేంద్రంగా భూమికి 33 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8 గా నమోదైంది.

ఈ భూకంపం సంభవించిన కొన్ని నిమిషాలకే ఢిల్లీలో 5.3 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. 30 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన సమాచారం లేదు.

ఇక భూకంపంపై సమాచారం అందుకున్న ప్రధాని నరేంద్రమోదీ అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. భూకంప నష్టంపై ఆయా రాష్ట్రాల నుంచి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివేదికలు కోరారు. భూకంప సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల కోసం రుద్రప్రయాగ్ చేరుకున్నాయి. తక్కువ తీవ్రతే అయినా బలంగా ప్రకంపనలు రావటంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ప్రస్తుతం దానిని గుర్తించే పనిలో ఉన్నామని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : North India  Earthquake  Delhi  Punjab  Uttarkhand  Alert  

Other Articles