కొత్త పార్టీ... రజనీ ఏం చెప్పాడు.. మీడియా ఏం చెబుతోంది? | Rajanikanth Casual comments on Power misfire.

Rajinikanth speaks about power

Superstar Rajinikanth, Rajinikanth Power Comments, Rajinikanth Spiritual Power, Rajinikanth New Party, Rajinikanth Sasikala, Rajinikanth Politics, Rajinikanth 2017, Rajinikanth Tamil Nadu, Rajanikanth About Politics, Rajinikanth Comments, Rajinikanth Political Comments

Superstar Rajinikanth's recent statement about liking "power" sent ripples through Tamil Nadu - till he clarified that he had spoken in context of spiritualism. There has been speculation that Rajinikanth might launch his own political party, reportedly with support from the BJP, which wants to make inroads in the south Indian state. Many believed that the actor, who has stayed away from politics, was unhappy with the current state of affairs in Tamil Nadu politics.

రజనీకాంత్ కామెంట్స్... రాజకీయ కలకలం

Posted: 02/06/2017 07:57 AM IST
Rajinikanth speaks about power

సరిగ్గా దశాబ్దం క్రితం జయలలితపై ఏ రేంజ్ లో ప్రత్యక్షంగా విమర్శలు చేశాడో.. ఆమె చనిపోయాక అదే స్థాయిలో పొగడ్తలు కురిపించాడు సూపర్ స్టార్ రజనీ కాంత్. అమ్మ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడంటూ చెప్పిన నాలుకను యాంగిల్ మార్చి ఆమ్మ ఒక అష్టలక్ష్మీ అంటూ వ్యాఖ్యానించి ఆసక్తి రేపాడు. రజనీకి రాజకీయాలపై గాలి మళ్లీందంటూ దీనిపై విశ్లేషకులు కూడా చిన్న దుమారం రేపటం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఓవైపు తమిళ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన క్రమంలో తలైవా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం సృష్టించటమే కాదు, కొందరిలో కలవరమూ పుట్టిస్తున్నాయి. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని గతంలో పలుమార్లు పేర్కొన్న ఆయన తాజాగా ‘అధికారమంటే ఇష్టమే’నని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే దానికి ఆయన తాజా వ్యాఖ్యలు సంకేతమని చెబుతున్నారు. అంతేకాదు బీజేపీ మద్దుతో సొంతంగా రాజకీయ పార్టీ కూడా ప్రారంభించనున్నారనే ఊహాగానాలు ఇప్పుడు తమిళనాడులో ఊపందుకున్నాయి.

జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రజనీకాంత్ తీవ్ర అసంతృప్తి ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడం ఒక్క రజనీ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. పన్నీర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి చాకచక్యంగా తప్పించిన శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా
ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు. అంతేకాదు రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున సందేశాలు సైతం పంపుతున్నారు.

వ్యవహారం ముదురుటుండటంతో తన వ్యాఖ్యలపై తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తర్వాత రజనీ మరో ప్రకటన చేశాడు. కేవలం ఆధ్యాత్మిక ధోరణితోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెబుతున్నాడు. డబ్బు, పరపతిని ఓపక్క, ఆధ్యాత్మికాన్ని ఓపక్క పెడితే రెండో దానికే నా ప్రాధాన్యత ఉంటుదని, దానికున్నంత పవర్ దేనికి ఉండదని, ఆ ఉద్దేశ్యంతోనే తాను పవర్ అంటే ఇష్టమని వ్యాఖ్యానించానని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే అప్పటికే మొదటి వ్యాఖ్యలకే మీడియాలో ప్రాధాన్యత ఇవ్వటం జరిగిపోయింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Super Star  Rajinikanth  Politics  Power Comments  

Other Articles