అమెరికా ‘వీసా’ బాంబుకు అనుకోని మద్ధతు | Poland and UAE supports to Trump Immigrants Ban.

Trump has the right to ban immigrants

Donald Trump, Immigration Order, Poland Trump, UAE Donald Trump, Donald rump Visa Bomb, US President Donald Trump, Donald Trump Human Rights Violation

Donald Trump's immigration order has sparked protests at airports and the condemnation of many across the world as a human rights violation. Poland's foreign minister has defended President Donald Trump's immigration order banning entry to people from seven mostly Muslim countries, arguing that every sovereign country has the right to decide its own immigration policy. UAE also supports it.

వివాదాస్పద నిర్ణయానికి ఫుల్ సపోర్ట్

Posted: 01/31/2017 10:20 AM IST
Trump has the right to ban immigrants

అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఓవైపు శరణార్ధులు, వలసవాదులు తమ దేశంలో అడుగుపెట్టకుండా ఆంక్షలు విధిస్తే, ప్ర‌పంచ దేశాలన్నీ మండిపడుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపటం మంచిదే అయినా ఆ వంకతో ఇస్లాం దేశాలపై విరుచుకుపడటం సబబు కాదనేది అందరి వాదన. మరోవైపు ఉద్యోగులు, విద్యార్థులే ప్రధాన టార్గెట్‌ గా అమెరికా వీసా బాంబును కూడా పేల్చేందుకు సిద్ధమైపోతున్నాడన్న సంకేతాలు అందుతున్నాయి. అయితే ఈ దశలో కూడా ఆయనకు అనుకోని మద్ధతు వచ్చి పడింది.

పోలండ్ మాత్రం ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ తెలిపింది. పోలండ్ ఆర్థిక మంత్రి విటోల్డ్‌ ట్రంప్ కి బాస‌ట‌గా నిలిచారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారిని తమ దేశంలో ఉండనీయలన్న రూలేం లేదు. పైగా ట్రంప్ ప్రజలచే ఎన్నుకోబడిన నేత.త‌మ దేశంలోకి వ‌చ్చే ముస్లింల‌పై ఆంక్ష‌లు విధించే అధికారం ట్రంప్‌కు ఉంద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు స్వ‌యంగా సౌదీరాజు సాల్మ‌న్ కూడా ట్రంప్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించ‌డం విశేషం.

అంత‌ర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా, యెమ‌న్‌లోని శ‌ర‌ణార్థుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించే సుర‌క్షిత ప్రాంతాల‌ను ఏర్పాటు చేసి, వాటికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌న్న ట్రంప్ నిర్ణ‌యానికి సాల్మ‌న్ మ‌ద్ద‌తిచ్చారు. శ‌ర‌ణార్థుల‌కు ప‌సిఫిక్ దీవుల్లో ఆశ్ర‌యం క‌ల్పించేందుకు ట్రంప్ అంగీక‌రించిన‌ట్టు ఆస్ట్రేలియా ప్ర‌ధాని ట‌ర్న్‌బుల్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఖ‌ర్చుల‌ను తామే భ‌రిస్తామ‌ని ఆయ‌న తెలిపాడు. మొత్తానికి ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన ట్రంప్, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జారీ చేయాల్సిన కార్య నిర్వాహక ఉత్తర్వులను కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న చందాన తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Immigration Order  Poland  UAE  Support  

Other Articles