కాషాయ పార్టీపై రాహుల్ ట్విట్ వైరల్.. 'Dear BJP, don't be afraid,' Rahul Gandhi says on Twitter

Rahul gandhi mocks saffron party after ec complaint

Rahul Gandhi, Twitter, Rahul mocks bjp, rahul gandhi twitter, Election Commission, Congress, Mukhtar Abbas Naqvi, NEW DELHI, Prakash Javadekar, BJP

Rahul Gandhi took a jibe at BJP for approaching the Election Commission to demand freezing Congress' poll symbol

కాషాయ పార్టీపై రాహుల్ ట్విట్ వైరల్..

Posted: 01/18/2017 03:15 PM IST
Rahul gandhi mocks saffron party after ec complaint

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంసదర్భంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలకు మధ్య మాటల యుద్దం తారాస్థాయిలో చెలరేగుతుంది. ఇందుకు సోషల్ మీడియా కూడా బాగానే అజ్యం పోస్తుంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని పప్పూ (చిన్నపిల్లాడు) అంటూ అభివర్ణించి.. ఆయనను ఎవరూ పట్టించుకోకుండా చేసిన కాషాయ వర్గం నేతలకు తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం ఆయనే వారికి చుక్కలు చూపెడుతున్నారు.

ఇటీవల ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసి.. అవినీతి అరోపణలు గుప్పించిన రాహుల్.. ప్రధానికి ధైర్యముంటే తన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బిర్లా- సహారా సంస్థల నుంచి మోడీ ముడుపులు తీసుకున్నారా లేదా..? అన్న విషయాన్ని చెప్పాలని సూటిగా ప్రశ్నించిన రాహుల్.. తాజాగా తమ పార్టీ గుర్తుపై కూడా ఇటీవల (గత వారం) జరిగిన జనవేదన సమ్మెళన్ లో ప్రస్తావించారు.

కాంగ్రెస్ ఎన్నికల గుర్తు 'హస్తం'పై దేపుళ్లు భక్తులకు ఇచ్చే అభయహస్తం లాంటి గుర్తుతో తమ పార్టీ దేశ ప్రజలకు భరోసాను కల్పిస్తుందని, తమ ఎన్నికల గుర్తు దేవుళ్లలో, ఆధ్యాత్మిక గురువుల్లో కనిపిస్తుందని కూడా అన్నారు. అయితే రాహుల్ ఎన్నికల సంఘం నియామవళిని ఉల్లంఘించారని, దీంతో కాంగ్రెస్ పార్టీ గుర్తైన హస్తాన్ని రద్దు చేసి మరో గుర్తు ఇవ్వాలని బీజేపీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై మళ్లీ ఆయన తనదైన శైలితో ట్విట్ చేశారు.

కేంద్రమంత్రులు, బీజేపి నేతలు ప్రకాష్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారన్న వార్తలు తెలిసిన అనంతరం రాహుల్ గాంధీ వినూత్నంగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. "డియర్ బీజేపీ డరో మత్" (ప్రియమైన బీజేపీ భయపడకండీ) అని ఆయన పెట్టిన ట్వీట్ ను వందలాది మంది షేర్ చేసుకున్నారు. ఇక దీంతో రాహుల్ గాంధీ బీజేపి నేతలకు గట్టి స్ట్రోక్ ఇచ్చారని పలువురు కాంగ్రెస్ నేతలు కూడా కామెంట్లె పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Twitter  Election Commission  Congress  Mukhtar Abbas Naqvi  Prakash Javadekar  BJP  

Other Articles