ఏపీ ఎమ్మెల్సీ బ్యాంకులను మోసం చేశాడంట... | MLC Vakati Narayana Reddy cheat banks.

Mlc vakati properties seized by banks

Nellore MLC, Vakati Narayana Reddy, MLC Vakati, Vakati Bank Case, Vakati Narayana Reddy cheat banks, Banks seized MLC properties, MLC vakati properties, MLC Vakati debts

Nellore MLC Vakati Narayana Reddy cheat banks, Officials seized his properties.

ఏపీ ఎమ్మెల్సీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు

Posted: 01/18/2017 09:14 AM IST
Mlc vakati properties seized by banks

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీకి పెద్ద షాక్ తగిలింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారయణరెడ్డి పెద్ద ఎత్తున్న అప్పులు చేయటంతో బ్యాంకు అధికారులు ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.443.27 కోట్ల అప్పులున్నాయ‌న్న పేర్కొన్న అధికారులు జప్తు చేసేశారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆయన అధికార తెలుగుదేశం పార్టీలోకి మారిపోయారు.

వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌, పవర్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు హామీదారుగా ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ నుంచి ఈ మూడు కంపెనీలు మొత్తం రూ.443.27 కోట్ల రుణం తీసుకున్నాయి. అయితే, వీటిని తిరిగి చెల్లించ‌డంలో విఫ‌లం కావ‌డంతో రుణాల‌కు హామీదారుగా ఉన్న నారాయ‌ణ‌రెడ్డికి సంబంధించిన ఆస్తుల‌తోపాటు కంపెనీల పేరిట ఉన్న ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు సదరు బ్యాంకులు ప్ర‌క‌టించాయి.

స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట‌లోని కొన్ని స్థిరాస్తుల‌తోపాటు కొన్ని భూముల‌ను కూడా స్వాధీనం చేసుకున్న‌ట్టు బ్యాంకులు పేర్కొన్నాయి. కాగా, రుణం చెల్లింపున‌కు ఇచ్చే హెచ్చ‌రిక నోటీలు త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు లిఖిత పూర్వ‌కంగా బ్యాంకుల నుంచి అంద‌లేద‌ని ఎమ్మెల్సీ తెలపటం విశేషం. కాగా, గతంలో ఓ బిల్డర్‌తో కుమ్మక్కై అక్రమంగా ఓ స్థలం ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంటూ ఆయనపై చీటింగ్ కేసు కూడా నమోదైంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLC Vakati Narayana Reddy  Debts  Banks  Seized  properties  

Other Articles