మిలిటరీ బిగ్ మిస్టేక్.. 100 మంది చనిపోయారు | Nigeria air strike error kills dozens in refugee camp.

Nigerian military jet bombs refugee camp killing dozens

Nigeria, bombs camp, air strike error, Bombing refugee camp, Boko Haram militants, Attack on refugee camp, Nigeria refugee camp attack, Nigerian Military, Nigeria Jet attack, 100 killed in Air Strike, Nigeria news

Nigeria mistakenly bombs camp, kills more than 100. an air force jet accidentally bombed a camp in northeast Nigeria instead of Boko Haram militants, medical charity MSF said

పొరపాటు వంద మంది ప్రాణాలు తీసింది

Posted: 01/18/2017 08:02 AM IST
Nigerian military jet bombs refugee camp killing dozens

సైన్యం పొర‌పాటున చేసిన నైజీరియాలో వంద‌మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బోకో హరామ్ ఉద్యమకారులను టార్గెట్ చేసుకుని సైన్యం మంగళవారం దాడులకు తెగబడింది. అయితే శ‌ర‌ణార్థుల శిబిరాన్ని ను ఉగ్ర క్యాంపుగా భావించి బాంబులు వేసింది. దీంతో వంద‌మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

శ‌ర‌ణార్థులతోపాటు వారికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది, స్వ‌చ్ఛంద సంస్థ‌ల కార్య‌క‌ర్త‌లు కూడా మృతి చెందారు. బొకోహ‌రాం తీవ్ర‌వాదుల గుప్పిట్లో ఉన్న ఈశాన్య నైజీరియాలోని ర‌న్ న‌గ‌రంపై నైజీరియా సైన్యం దాడుల‌కు దిగింది. పెద్ద ఎత్తున వైమానిక దాడులు జ‌రిపింది. న‌గ‌రంలోని తీవ్రవాద శిబిరాలే ల‌క్ష్యంగా బాంబులు వేసింది. వంద‌మందికిపైగా మృతి చెందిన‌ట్టు మిల‌ట‌రీ కమాండ‌ర్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ల‌క్కీ ఇరాబ‌ర్ పేర్కొన్నారు. త‌మ‌వైపు నుంచి పెద్ద పొర‌పాటు జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మరోవైపు అదే గ్రామం నుంచి 300 మంది అమ్మాయిలు తప్పిపోవటం, వారిలో 196 మంది జాడ ఇప్పటికీ తెలీకపోవటం దిగ్భ్రాంతి కలిగించే అంశాలు. ఇక బాంబు దాడులను అధ్యక్షుడు మహమ్మదూ బుహారీ సమర్థించుకుంటున్నాడు. ఇలా చేయటం మూలంగానే ఉగ్రవాదులు గ్రామాలను వదిలి బయటకు వస్తూ సైన్యం చేతికి చిక్కుతున్నారంటూ చెబుతున్నాడు. కాగా, బోకో హారామ్ ఉగ్రవాద సంస్థ మూలంగా ఇప్పటికీ 20,000 ప్రాణాలు కోల్పోగా, అంతర్యుద్ధం కారణంగా ఈ 7 ఏళ్లలో 2 మిలియన్ల మంది దేశం విడిచి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nigeria  Military  Mistake  refugee camp  Air Strike  100 killed  

Other Articles