జామాతకు కీలక పదవి.. దశమగ్రహం ఎఫెక్ట్ వుండేనా..? Jared Kushner Tapped as Trump Senior Adviser

Jared kushner to serve as trump senior adviser

Donald Trump, Jared Kushner, White House senior adviser, real estate executive, trump son-in-law, US president, America

Donald Trump appointed his influential son-in-law Jared Kushner as a White House senior advise, putting the young real estate executive in position to exert broad sway over both domestic and foreign policy,

జామాతకు కీలక పదవి.. దశమగ్రహం ఎఫెక్ట్ వుండేనా..?

Posted: 01/10/2017 11:45 AM IST
Jared kushner to serve as trump senior adviser

అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్‌ ట్రంప్ ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు తరహాలో తాను పదవిలో కొనసాగనున్న నాలుగు సంవత్సరాలు నెలకు కేవలం ఒక్క డాలర్ జీతాన్ని మాత్రమే తీసుకుంటాను అని ప్రకటించిన నేపథ్యంతో పాటు తన క్యాబినెట్ లో సొంత అల్లుడు జారెద్ కుష్నర్‌కు కీలక పదవి కట్టబెట్టడం కూడా రమారమి ఎన్టీయార్ తరహా నిర్ణయమే. అయితే పదవీచ్చుతుడైన తరువాత ఎన్టీయార్ తన అల్లుడి విషయంలో జామాత దశమ గ్రహ: అని కూడా అభివర్ణించారు.

అయితే డోనాల్డ్ ట్రంఫ్ కూడా జామాతా దశమ గ్రహ అని అంటారా..? లేదా..? అన్న విషయాన్ని పక్కనబెడితే.. ఆ ప్రభావం వుంటుందనే ముందుగా తన అల్లుడికి కీలకమైన పదవిని కట్టబెట్టారా..? అన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ట్రంప్ ఏకంగా తన అల్లుడ్ని తనకు సీనియర్‌ సలహారుదారుగా నియమించారు. వాణిజ్యం, మిడిల్ ఈస్ట్‌ వ్యవహారాల్లో సలహాలు ఇచ్చే బాధ్యతను కుష్నర్‌కు అప్పగించారు. అమెరికా అధ్యక్షుడి బంధువులు కీలక పదవులను చేపట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. చట్టబద్దమైన ఆమోదం లభించిన వెంటనే 35 ఏళ్ల కుష్నర్ సలహాదారు పదవి చేపడతారు.

ప్రభుత్వ పదవుల్లో ఆశ్రిత పక్షపాతాన్ని నిరోధిస్తూ 1967లో చేసిన చట్టాన్ని ఉల్లంఘించలేదని నిర్ధారణ అయిన తర్వాతే కుష్నర్‌ పదవి చేపట్టడానికి వీలవుతుంది. సలహాదారుకు జీతం చెల్లించరు కాబట్టి సెనేట్‌ ఆమోదం అవసరం లేదు. ‘కుష్నర్‌ తనకు లభించిన అద్భుత ఆస్తి.. ఎన్నికల ప్రచారం, అధికార బదిలీలో నమ్మకమైన సలహారుదారుగి నిలిచాడ’ని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను పెళ్లాడిన కుష్నర్‌.. న్యూయార్క్ లో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యవరించారు. తన భర్తకు కీలక పదవి దక్కడంతో తాను ఇంటికే పరిమితం కావాలని ఇవాంకా భావిస్తున్నారు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కు షిప్ట్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles