భార్య పక్కన ఉండగానే స్టార్ హీరో కి విచిత్ర ప్రశ్న.. ఏం జరిగింది? | Farmer asked Vijaykanth that Who are You?.

Dmdk chief vijayakanth took food at road side

Dmdk chief vijayakanth, Vijaykanth Who Are you, Vijaykanth not recognize, Dmdk chief Jallikattu, Vikaykanth on Jallikattu

Dmdk chief vijayakanth questioned by a farmer while taking food at road side.

ఏయ్... ఎవడ్రా నువ్వు ? స్టార్ హీరోకి షాక్

Posted: 01/10/2017 11:26 AM IST
Dmdk chief vijayakanth took food at road side

ఎక్కితే గిఱ్ఱపు రౌతు, దిగితే కాలిబంటు... ఇది ప్రముఖ హీరో విజయ్ కాంత్ పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు ప్రతిపక్షంగా వెలుగు వెలిగిన ఆయన అన్నాడీఎంకే దెబ్బకి ఇప్పడు అడ్రస్ లేకుండా పోయాడు. ఇక అమ్మ చనిపోయాక రాజకీయంగా కలకలం రేగటంతో ఇదే సందుగా భావించి దూరేందుకు యత్నిస్తున్నాడు. ఈ క్రమంలో జల్లికట్టు క్రీడా నిషేధంపై తన పార్టీ డీఎండీకే తరపున పోరాటానికి సిద్ధమయ్యాడు.

ఈ క్రమంలో ఊరురా తిరుగుతున్న ఆయనకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. సోమ‌వారం ఈరోడ్‌లో ఈరోడ్ జిల్లాలోని సెన్నిమ‌లై లో తన యాత్రను నిర్వహించారు. అయితే మ‌ధ్యాహ్య భోజ‌న స‌మ‌యం కావ‌డంతో మార్గ‌మ‌ధ్యంలో కారును ఆపి ఓ పెంకిటిల్లు వ‌ద్ద ఆగి అక్క‌డ ఉన్న ఖాళీ ప్ర‌దేశంలో సేద తీరారు. అరిటాకులు ప‌రుచుని ఇంటి నుంచి తెచ్చుకున్న భోజ‌నాన్ని వ‌డ్డించుకున్నారు. ఎండ దంచేస్తుండ‌డంతో విజ‌య‌కాంత్ త‌న త‌ల‌పై ఎర్ర‌ని తువ్వాల‌ను త‌ల‌పాగాలా చుట్టుకున్నారు. అదే స‌మ‌యంలో పొలం నుంచి వ‌చ్చిన ఇంటి య‌జ‌మాని వారిని చూసి అదిలించాడు.

ఎవ‌డ్రా మీరు? ఇక్కడేం పని? ఇక్క‌డ భోజనం ఎందుకు చేస్తున్నారంటూ క‌సురుకుంటూ వ‌చ్చాడు. కూడా పక్కనే ఆయన భార్య ప్రేమలత కూడా ఉంది. అయితే ద‌గ్గ‌రికొచ్చి చూసిన రైతు చాలా సేపటికి గానీ వాళ్లని గుర్తుపట్టలేకపోయాడు. ఆపై నిశితంగా పరిశీలించి ఆశ్చ‌ర్య‌పోయాడు. సాక్షాత్తు న‌టుడు విజ‌యకాంత్‌, ఆయ‌న భార్య ప్రేమ‌ల‌త కావ‌డంతో నోట‌మాట రాలేదు. ఆ త‌ర్వాత తేరుకుని ఇంట్లో నుంచి మ‌రిన్ని వంట‌కాలు తెచ్చి వారికి వ‌డ్డించాడు. రైతు అభిమానానికి ముగ్ధ‌లైన వారు వాటిని కూడా ఆర‌గించారు. విష‌యం తెలిసిన స్థానికులు వారిని చూసేందుకు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తుండ‌డంతో య‌జ‌మానికి థ్యాంక్స్ చెప్పి అక్క‌డి నుంచి త్వరగతిన వెళ్లిపోయాడు.

Vijaykanth E road yatra

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Vijaykanth  Jallikattu Yatra  Farmer  insult  

Other Articles