మసాజ్ కోసం వెళ్లితే ఏం చేశారో తెలుసా? | After neck pain massage center what did to him,

One year probe for bhopal massage death

Massage Death, Massage Parlor, Bhopal Massage Parlor, Bhopal man died after massage, Massage Murder, Harnabh Singh culpable homicide, Massage death Not Muder

One year probe finds out that Bhopal man died after massage.

మసాజ్ లో మిస్టేక్ ప్రాణాలు తీసింది

Posted: 12/23/2016 11:37 AM IST
One year probe for bhopal massage death

మెడనొప్పికి చికిత్సగా మసాజ్ చేయించుకున్నాడు ఓ 35 ఏళ్ల వ్యక్తి. అదే అతని పాలిట శాపంగా మారింది. ఏకంగా మెడ ఎముక విరిగొట్టేశారు నిర్వాహకులు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. గతేడాది భోపాల్ లో జరిగిన ఘటన వివరాళ్లోకి వెళ్లితే... 2015 డిసెంబర్ 12వ తేదీన నజీరాబాద్ ప్రాంతానికి చెందిన హర్నభ్ సింగ్ అనే వ్యక్తి తమ బంధువుల ఇంట్లో పార్టీలో ఉండగా తనకు మెడ బాగా నొప్పిగా ఉందని చెబుతూనే కుప్పకూలిపోయాడు.

అయితే అక్కడ ఉన్న మధు ఠాకూర్ అనే వ్యక్తి అది ఎలా తగ్గుతుందో తనకు తెలుసని అతడు చెప్పి, ఊరి అవతల ఉన్న మసాజ్ పార్లర్‌కు తీసుకెళ్లాడు. అయితే.. హర్నభ్‌కు అక్కడ చేసిన మసాజ్‌ కారణంగా మెడ ఎముకల్లో ఒకటి విరిగిపోయి, అతడు స్పృహ కోల్పోయాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ఏడాది పాటు దర్యాప్తు జరిగిన తర్వాత.. అతడి ప్రాణాలు పోవడానికి మసాజే కారణమని తేలింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. దానిపై ఇన్నాళ్ల పాటు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత. మసాజ్ సెంటర్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు అతడి మృతికి కచ్చితమైన కారణం ఏంటో చెప్పకపోవపడంతో కేసు నమోదు చేయడంలో ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhopal Massage Death  culpable homicide  Not Murder  

Other Articles