నిర్భయ్ ప్రయోగం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అవుతోంది? | Nirbhay cruise missile's test fails for the fourth time.

Nirbhay missile test an utter failure

Nirbhay Missile, DRDO's Nuclear Missile, DRDO Nirbhay, Nirbhay test again failure, Nirbhay Missile Failure, Nirbhay Fails Another Test, Nirbhay cruise missile, Indian Nuclear-Capable Cruise Missile, Defence Research and Development Organisation

Defence Research and Development Organisation's Nuclear-Capable Cruise Missile 'Nirbhay' Fails Another Test.

నిర్భయ్... ఓ అట్టర్ ఫ్లాప్ షో

Posted: 12/22/2016 09:32 AM IST
Nirbhay missile test an utter failure

భారత రక్షణ దళంలో కలికితురాయిగా నిలిచిపోతుందనుకున్న నిర్భయ్ మరోసారి బిగ్ ఫెయ్యిలూర్ గా మారింది. సుదూరతీరాలకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యంతో రూపొందించిన ఈ' క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైంది. ఈ విసయాన్ని డీఆర్డీవో అధికారులు స్వయంగావెల్లడించారు.

ఒడిశాలోని బాలాసోర్‌ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రయోగ కేంద్రం నుంచి బుధవారం దీనిని ప్రయోగించగా, నిర్దేశిత మార్గంలో అది ప్రయాణించలేదని అన్నారు. కాగా, ఈ క్షిపణి ప్రయాగాన్ని మొత్తంగా నాలుగు సార్లు చేపట్టగా మూడు సార్లు విఫలమైంది. తొలిసారి మార్చి 12, 2013లో 'నిర్భయ్‌' క్షిపణిని ప్రయోగించగా 20 నిమిషాల ప్రయోగంలో పూర్తిగా విఫలమైంది.

అక్టోబర్‌ 17న 2014లో రెండోసారి, అక్టోబర్‌ 2015లో మూడోసారి ప్రయోగించారు. ఇక తాజాగా నిర్వహించిన పరీక్ష కూడా విఫలమైంది. అయితే రెండోసారి ప్రయోగించిన సమయంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన 800 కి.మీ లక్ష్యానికి బదులుగా 1,010 కి.మీ ప్రయాణించి, ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో మళ్లీ ప్రయోగాలను నిర్వహించేందుకు అధికారులు యత్నిస్తుండగా, విఫలమవుతూ వస్తోంది.

నిర్భయ్ ప్రత్యేకతలు...
సుమారు వెయ్యి కిలోమీటర్ల లక్ష్యాలను కూడా సులువుగా చేధించేందుకు డీఆర్డీవో శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. సుమారు 300 కేజీల వార్ హెడ్ ను ఇది మోసుకుపోగలదు. లక్ష్యానికి వంద మీటర్ల దూరంలో ఉన్న సమయంలో కూడా దానిని దిశ మళ్లింపజేయటం దీని ప్రత్యేకత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles