అమ్మ చావు లెక్క తేలింది.. వైెఎస్ కంటే ఎక్కువే | 597 died after Jayalalitha demise.

Grief post jayalalithaa s death

Jayalalitha Demise, grief post Jayalalitha’s death, 597 Amma devotees died, AIADMK on Jayalalitha's death, compensation for Jayalalitha, Jayalalitha YS Rajashhekar reddy, Jayalalitha death toll

Rs 3 lakh compensation for families of 597 who died of grief post Jayalalitha’s death.

అమ్మ అభిమానులు అంత మంది చనిపోయారా?

Posted: 12/20/2016 10:23 AM IST
Grief post jayalalithaa s death

తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత చనిపోయి నేటికి పదిరోజులు పూర్తయ్యింది. ఆమ్మ మరణ వార్త‌‌ను తట్టుకోలేక ఇంతవరకు మొత్తం 597 మంది అసువులు బాసారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. జయ చనిపోయిన వార్తను తట్టుకోలేక వీరంతా చనిపోయారు. ఆయా మృతుల కుటుంబాల‌కు రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఏఐఏడీఎంకే నేత‌లు సోమవారం ప్రకటించారు.

అంతేకాదు వారి కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు ఓ ప్రకనటలో పేర్కొన్నారు. జ‌య‌ల‌లిత మృతి నేప‌థ్యంలో మరో రెండు సంఘటనల్లో గాయపడి ఆసుత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు అభిమానుల‌కు రూ.50,000ల చొప్పున పరిహారం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. కాగా, ఏడేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ సీఎం రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోగా, ఆయన అభిమానులు వందకు పైగానే చనిపోయిన విషయం తెలిసిందే.

మరోవైపు జయలలితకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ సీఎం పన్నీర్ సెల్వం నేడు ప్రధానిని కలిసి విజ్నప్తి చేయనున్నాడు. పార్లమెంట్ బయట ఆమె కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించటంతోపాటు, అత్యున్నత పురస్కారం ప్రకటించాలని కోరనున్నాడు. అదే సమయంలో వార్థా సమయంలో వెయ్యి కోట్ల నష్టపరిహారం కోరుతూ లేఖ రాసినప్పటికీ స్పందన లేకపోవటంతో, నేరుగా రంగంలోకి దిగి విజ్నప్తి చేయనున్నాడంట.

మృతిపై సుప్రీంలో పిటిషన్
అన్నాడీఎంకే బషిహ్కృత ఎంపీ శశికళ పుష్ప జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు ఆమె మరణంలో జయ నిశ్చెలి శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉండి ఉంచొచ్చన్న ఆరోపణలు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amma Jayalalitha  Death Toll 597  3 lakh compensation  

Other Articles