షా గౌస్ లో కుక్క బిర్యానీ.. ఫేక్ న్యూస్ ఆ ఛానెల్ పనేనా? | Dog meat mixed with biryani Shah Ghouse.

Dog meat mixed with biryani

Dog meat mixed with biryani, Shah Ghouse raids, Dog Biryani, shah ghouse biryani, shah ghouse biryani Dog meat, utton or Dog meat, Hyderabad hotels raids, Fake news on Biryani, Fake news on Shah Ghouse, Shah Ghouse raids, Shah Ghouse owner

Dog meat mixed with biryani Shah Ghouse Fake news confirmed after testing.

ITEMVIDEOS:కుక్క మాంసంతో కల్తీ బిర్యానీ! ఎవరి పని?

Posted: 12/14/2016 09:57 AM IST
Dog meat mixed with biryani

టీవీ, పేపర్, ఫేస్ బుక్, ట్విట్టర్ పేరు ఏదైనా వాటికుండే కామన్ నేమ్ మాత్రం మీడియానే. వార్తలను వేగంగా తెలుసుకునేందుకు జనాలు వీటిని వాడుకోవాలని చూస్తుంటే.. హిట్స్ కోసమే అవి మాత్రం పుకార్లను వాడేసుకుంటున్నాయి. ఓ వారం క్రితం వాట్సాఫ్ లో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇంతకు ముందుకు పిల్లి మాంసంతో బిర్యానీ వండినట్లు వార్తలు వచ్చినట్లు తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కుక్క మాంసంతో వండుతున్నారని, వాటికి సంబంధించిన ఫోటోలు, కొన్ని ఫేమస్ బిర్యానీ హౌస్ ల పేర్లను అందులో చేర్చారు. ఇక అవి పట్టుకుని కొన్ని ఛానెళ్లయితే క్రియేటివిటీతో వీడియోలు, కథనాలు చేసి అవి మనదగ్గరే అంటూ ఓ ప్రముఖ హోటల్ ను టార్గెట్ చేసి వరుసగా ప్రచారం చేశాయి.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు హైదరాబాద్ లోని హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఆహారాన్ని కల్తీ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై మంగళవారం తనిఖీలు నిర్వహించి ఉత్తేదే అని తేల్చారు. అయితే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశ్యంతో రాయదుర్గం ఠాణాకు సమీపంలో ఉండే షాగౌస్‌ హోటల్‌ నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం నాచారం లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపారు.

 

పాతికేళ్లుగా హోటల్‌ బిజినెస్‌లో ఉన్న తమకు, 15 సార్లు ఉత్తమ హోటల్‌ అవార్డులు వచ్చాయని షాగౌస్ హోటల్‌ యజమాని రబ్బానీ విలేకరులతో తెలిపాడు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు సృష్టించిన ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తమ హోటల్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలపై సైబర్‌ క్రైం విభాగంలోనూ, రాయదుర్గం ఠాణాలోనూ ఫిర్యాదు చేశామన్నారు. నగరంలోని పలు హోటళ్ల యజమానులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

అయితే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిచే కబేళాల నుంచి కాకుండా, బయటి నుంచి మాంసం కొనుగోలు చేస్తుండటంతో గ్రేటర్ పరిధిలోని ఆయా హోటళ్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Ghouse  Dog meat Biryani fake  

Other Articles