క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ను కిడ్నాప్ చేయండీ.. Kidnap Sachin Tendulkar to bolster visitors’ batting, says David Cameron

Kidnap sachin tendulkar to bolster visitors batting says david cameron

kidnap, Sachin Tendulkar, train, England cricket team, David Cameron, india vs england, England in India 2016, India, Team India, cricket

England cricket team is having a hard time on their tour to India. After three Tests of the five-match series, they are trailing 0-2, and have had to deal with a spate of injuries.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ను కిడ్నాప్ చేయండీ..

Posted: 12/03/2016 07:52 PM IST
Kidnap sachin tendulkar to bolster visitors batting says david cameron

బ్రిటెన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ చతురోక్తులు విసరడంలోనూ తనకు సాటి లేరని నిరూపించుకున్నారు. తమ దేశానికి చెందిన జట్టు అటలో బాగా రాణించకపోతే.. ఎవరైనా జట్టు క్రీడాకారులపైనో, లేక బోర్డు సభ్యుల పైనో, లేక సెలక్షన్ కమిటీపైనో విమర్శలు చేస్తారు. కానీ కామెరూన్ మాత్రం ఏకంగా తమ జట్టుకు క్రికెట్ నేర్పించేందుకు భారత క్రికెట్ సంచలనం సచిన్ టెండూల్కర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఇండియాలో టూర్ లో అష్టకష్టాలు పడుతున్న ఇంగ్లాండ్ టీంకు శిక్షణ ఇవ్వడానికి సచిన్ ను కిడ్నాప్ చేయాలంటూ చమత్కరించారు.
 
హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో   పాల్గొంటున్న  కామెరూన్ ఈ  కమెంట్స్ చేశారు.   ప్రస్తుతం దేశంలో ఇరు  దేశాల మధ్య జరుగుతున్న సిరీస్ ని దృష్టిలో పెట్టుకుని కామెరూన్ చతురోక్తులు విసిరారు. టెండూల్కర్ ని కిడ్నాప్ చేసి, తమ ఆటగాళ్లకు ట్రయినింగ్ ఇప్పించాలన్నారు. మరోవైపు సచిన్  కూడా  సమావేశానికి హాజరు కానున్నారు. తాను ఇండియాకువచ్చిన ప్రతీసారీ దేశ పురోగతి, సామర్థ్యాన్ని చూసి ఎంతో ముగ్ధుణ్నవుతున్నానని వ్యాఖ్యానించారు.  దీంతో  సభలో చప్పట్లుమారు మోగాయి.  ఇరుదేశాలమధ్య చరిత్ర, సంస్కృతి  భాగస్వామ్యంతోపాటు ఉద్యోగాలు, పెట్టుబడులు ఆధారంగా  "ఆధునిక భాగస్వామ్యం"  పట్ల తనకు మక్కువ ఎక్కువన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidnap  Sachin Tendulkar  train  England cricket team  David Cameron  india vs england  cricket  

Other Articles