గే అంటూ రాహుల్ గాంధీ ట్వీట్.. ఏం జరిగింది? | Abusive Tweets Posted in Rahul Gandhi’s Twitter.

Rahul gandhi s twitter handle hacked

Rahul Gandhi, Rahul Gandhi Twitter, Rahul Twitter Hack, Rahul Abusive Tweets, AICC vice president, Congress vice president,

Rahul Gandhi's Twitter Account Hacked, Abusive Tweets Posted

షాక్: రాహుల్ ట్విట్టర్ లో బూతు పురాణం

Posted: 12/01/2016 08:05 AM IST
Rahul gandhi s twitter handle hacked

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ బుధవారం హ్యాక్ కి గురైంది. హ్యాకర్లు ఆయన అకౌంట్లో బూతు ట్వీట్లు చేశారు. రాహుల్ వ్యక్తిగత జీవితంతోపాటు, రాజకీయ కోణాన్ని స్పృశిస్తూ వల్గర్ కామెంట్లు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. వెంటనే అయిన కార్యాలయం సిబ్బందిని అప్రమత్తం చేయగా, వారు వాటిని తొలగించి అకౌంట్ ను బ్లాక్ చేసి ఆపై సైబర్ సెల్ కి ఫిర్యాదు చేశారు.

మొదట్లో సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోని రాహుల్ గాంధీ, ప్రధాని మోదీకి వస్తున్న ఆదరణ కారణంగా ఎంటర్ అయి ఆపై చురుగ్గా మెయింటెన్ చేస్తున్నాడు. కాగా, హ్యాక్ చేసి ట్వీట్లు చేసింది బయటి వ్యక్తి కాదన్న సమాచారం అందుతోంది. ఈ మధ్యే విధుల నుంచి తొలగించిన ఓ రాహుల్ వ్యక్తిగత సిబ్బందే ఈ చేష్టలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Rahul Gandhi twitter

రాహుల్ పై ఆగని జోకులు...

మరోవైపు ఈ అంశంను కూడా ఆసరాగా చేసుకుని ట్విట్టర్ లో రాహుల్ గాంధీపై జోకులు పేలుస్తున్నారు. ట్విట్లర్ హ్యాక్ అయ్యింది కదా ఇక ఏటీఎం పాస్ వర్డ్ మార్చుకోవటమే తరువాయి అని ఒకరు అంటే.. మోదీజీ అన్ని బయటపెట్టమన్నారు కదా! అందుకే చెప్పేశా అంటూ ఇంకోకరు.. రాహుల్ ఇంకా చంటి పిల్లాడే కదా అందుకే చోటా భీమ్ అనే పాస్ వర్డ్ పెట్టుకుని దొరికిపోయాడంటూ ఇలా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles