ఎంత వేస్తే అంత తీసుకోవచ్చు.. కండిషన్స్ అప్లై | RBI relaxes withdrawal limit of cash from bank deposits.

Rbi relaxes cash withdrawal limits to spur deposits

RBI, waives withdrawal limit, new and existing notes, bank Withdrawal, withdrawal limit, spur deposits, Reserve Bank of India

RBI waives withdrawal limits, but only for new and existing notes you deposit in your account.

ఎంత వేస్తే అంత విత్ డ్రా చేసుకోవచ్చు

Posted: 11/29/2016 09:11 AM IST
Rbi relaxes cash withdrawal limits to spur deposits

కొత్త నోట్ల కష్టాలకు చెక్ పెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 29 నుంచి కొత్త నోట్లను, పాత చెల్లుబాటుల నోట్లను ఎంత మొత్తం డిపాజిట్ చేస్తే, అంత మొత్తాన్ని అదనంగా బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

అంటే మీ వద్ద రూ. 2000, రూ. 500 కొత్త నోట్లతో పాటు చెలామణిలో ఉన్న నోట్లు తదితరాలు కలిపి ఓ పది వేల రూపాయలు ఉన్నాయనుకోండి. వాటిని బ్యాంకులో వేస్తే, మీరు ప్రస్తుతం ఉన్న విత్ డ్రా పరిమితి రూ. 24 వేల కన్నా, అధికంగా రూ. 10 వేల రూపాయిలు అంటే మొత్తంగా రూ. 34 వేలను బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.

బ్యాంకుల నుంచి బయటకు వెళ్లిన కొత్త నోట్లు తిరిగి డిపాజిట్ల రూపంలో రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ప్రజలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఇక కరెంటు ఖాతాలో రూ. 50 వేల పరిమితికి అదనంగా ఎంత డిపాజిట్ చేస్తే, అంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం నేటి నుంచి అమల్లోకి రానుంది .వ్యవస్థలో మరింతగా నగదు చెలామణిని పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

నవంబర్ 29 నుంచి ఎవరైనా ప్రస్తుతం చెల్లుబాటయ్యే కరెన్సీ(రూ. 2000, 500, 100, 50, 20, 10, 5) రూపంలో ఎంత డిపాజిట్ చేస్తే అతని విత్‌డ్రా పరిమితి ప్రస్తుత లిమిట్(వారానికి రూ. 24 వేలు)కి అదనంగా పెరుగుతుంది. చెల్లుబాటు కరెన్సీకి నేటి నుంచి పరిమితి వర్తించదన్న ఆర్‌బీఐ, ప్రస్తుతమున్న విత్‌డ్రా గరిష్ట పరిమితి దృష్ట్యా చాలామంది ఖాతాదారులు నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వెనకాడుతుండంతో ఈ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reserve bank of India  withdrawal limit  new and existing notes  

Other Articles