మోదీ కోసం నా భర్తకు విడాకులు ఇచ్చేస్తా! | Woman sacrificed husband for Modi.

Woman is ready to divorce her anti modi husband

Anti-Modi Husband, Rashmi Jain, Demonetisation, Woman Video on Modi, PM Modi woman

Rashmi Jain Is Ready To Divorce Her Anti-Modi Husband, Says PM Is Fighting A Lone Battle After Announcing Demonetisation.

నా భర్త కన్నా నాకు మోదీయే ఎక్కువ

Posted: 11/28/2016 08:53 AM IST
Woman is ready to divorce her anti modi husband

దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయమని మోదీ చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాల గగ్గోలుతో ఒక రకంగా ప్రజల్లో నోట్ల రద్దుపై కాస్త గందరగోళమే నెలకొంటోంది. అయితే ఎవరు ఒప్పుకోకపోయినా సరే మోదీ తీసుకున్న నిర్ణయంకు తాను మద్ధతు ఇస్తానంటున్న మహిళ అవసరమైతే మొగుడిని వదులుకునేందుకు కూడా సిద్ధమైపోయింది.

తన భర్త మోదీ వ్యతిరేకుడు అని చెబుతున్న ఆమె పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్న తన భర్త తీరు తనకు నచ్చడం లేదని, అవసరమైతే ఆయనకు విడాకులు ఇచ్చేస్తానని చెబుతోంది. రష్మీన్ జైన్ అనే ఒక మహిళ ఒకటిన్నర నిమిషం నిడివి గల వీడియోలో ఈ విషయమై ఆమె మాట్లాడింది

పెద్దనోట్ల రద్దును విమర్శిస్తూ, మోదీకి వ్యతిరేకంగా తన భర్త మాట్లాడుతున్నాడని, అవసరమైతే ఆయనకు విడాకులు ఇచ్చేస్తానని ఆ వీడియోలో ఆమె పేర్కొంది. ఎటువంటి స్వార్థం లేకుండా మోదీ పనిచేస్తున్నారని, ఆ విధంగా పనిచేసేవాళ్లు ఎంతమంది ఉంటారని ఆమె ప్రశ్నించింది. మోదీని అస్తమానం ఆరిపోసుకుంటున్నారు. ఆయనే వెళ్లి ఏటీఎం లలో డబ్బులు నింపాలా? మన కోసం ఒంటిరిగా ఆయన పోరాడుతున్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తింది.

 

ఆ మహిళ ఏ ప్రాంతానికి చెందిందో తెలీదు. రెండు రోజుల క్రితం అప్ లోడ్ అయిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman  Rashmi Jain  PM Modi  Divorce  Demonetisation  

Other Articles