మోదీలాంటి ప్రధాని మాకూ కావాలి:పాక్ | Pakstan Media hails Modi on currency notes ban.

Pak media praise modi on currency note ban

Pakistan Media, India New Currency, Pakistan on Modi, Pakistan New Currency, Pakistan India New Currency, Pak India New Notes, Pak Media, Pak Media Praised Modi, Prime Minister Narendra Modi, Pak needs Modi, Pakistan Modi, Pak on Indian PM, Pak on Modi's Black Money surgical Strikes, Pak Hails Modi

We Need A Prime Minister Like Modi, Pakistan praised Modi's decision after Currency Ban.

కొత్త నోట్లపై పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 11/12/2016 04:04 PM IST
Pak media praise modi on currency note ban

దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయంపై దేశ వ్యాప్తంగా కొందరు నిరసనగళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి చుక్కలు చూపించే ఈ చర్య ఖచ్ఛితంగా తుగ్లక్ ని తలపిస్తుందని ప్రతిపక్షాలతో సహా పార్టీలన్నీ విరుచుకుపడుతున్నాయి. అయితే రాజకీయ కోణంలో విమర్శలు వెలువెత్తుతున్నప్పటికీ, మేధావులు, ముఖ్యంగా సాధారణ పౌరులు దీనిపై సానుకూలంగానే ఉన్నారు.

నల్లధనం బయటికి రావటమే కాదు, దేశానికి మేలు చేసే ఈ చర్య ఎంతో అభినందనీయమైందని అంతర్జాతీయ మీడియాతో సహా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త నోట్ల వ్యవహారంతో నకిలీ కరెన్సీకి కూడా చెక్ పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్ లోని పెషావర్ లో భారత కరెన్సీని నోట్లను అధికారికంగానే నకిలీ చేస్తున్నారనే ఈ మధ్య మీడియాలో కూడా చూశాం.

మరి మోదీ చేసిన ఈ బ్లాక్ మనీ సర్జికల్ స్ట్రైక్స్ పై పాకిస్థాన్ ప్రశంసలు కురిపిస్తే ఎలా ఉంటుంది?. అవును... ఆ దేశ ఆర్థికవేత్తలు మోదీ తీసుకున్న నిర్ణయం శభాష్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. అక్కడి టీవీ ఛానెళ్లలో ఈ అంశంపై చర్చలకు హాజరవుతున్నవారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల బ్లాక్ మనీ బయటికి రావటమే కాదు, దేశ ఆర్థిక పురోగతి మారిపోయి అభివృద్ధి బాటలో నడుస్తుందని, పాక్ కి కూడా మోదీ లాంటి ప్రధాని అవసరం ఉందని, మన ప్రభుత్వం కూడా ఆయన ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలంటూ వారు సూచిస్తున్నారు.

అంతేకాదు ప్రస్తుతం చైనాతో ఎలాగైతే శాంతియుత చర్చలు జరుపుతున్నారో, అదే విధంగా పాక్ తో కూడా సంప్రదింపులు జరపాలని, ఈ విషయంలో మోదీ సానుకూలంగా స్పందిస్తేనే ఇరుదేశాలు అభివృద్ధి బాటలో కొనసాగటం ఖాయమని వారు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఇండియాలో మోదీ వ్యతిరేక గణం అంతా ఈ నిర్ణయంపై విరుచుకుపడుతుంటే, దాయాది దేశం పొగడటం ఇప్పుడు చిత్రంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan media  India Prime Minister  Narendra Modi  New Currency  Praise  

Other Articles