కొత్త నోట్లపై ట్విస్ట్ ఇచ్చిన బ్యాంకులు | New twist on New Currency.

Banks gives shock on new currency

New Notes, 500 and 2000 rupees notes, New Notes in ATM, huge crowd at banks, ATM Que, twist on New Currency, New Notes Delay

Bank services interrupted. New Rs 500, Rs 2000 notes at ATMs from Friday.

సెలవులు లేవంటూనే షాకిచ్చిన బ్యాంకులు!

Posted: 11/10/2016 08:05 AM IST
Banks gives shock on new currency

పెద్ద నోట్లతో చిల్లర చిక్కులు ఎదుర్కుంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బుధ వారం బ్యాంకింగ్ సేవలు పూర్తిగా(ఆన్ లైన్ కాకుండా) నిలిపివేసిన సందర్భంగా, శని, ఆది, సోమవారాలు పని చేస్తాయని ఇప్పటికే తెలిపింది.

ఈ దశలో గురువారం ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు పది గంటలవుతుందా? అని ప్రజలు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. పాత నోట్లను తొందరగా వదిలించుకోవాలన్న వారి ప్రయత్నంలో బ్యాంకుల గేట్ల దగ్గర కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నట్టుగా ప్రజలు గతంలో ఎప్పుడూ చూసి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇక తెల్లారింది. అనుకున్న టైం రానే వచ్చింది. మరొకొద్ది గంటలే అనుకుంటున్న సమయంలో బ్యాంకు అధికారులు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.

బ్యాంకులు తెరిచిన వెంటనే నగదు మార్పిడి చేయలేమని చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత మార్పిడి చేస్తామని, అది కూడా అతికష్టం మీదనే అని అంటున్నారు. బ్యాంకులకు ఇంకా పూర్తిస్థాయిలో నగదు చేరుకోకపోవడమే కారణమని చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాతే బ్యాంకులకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే సాయంత్రానికి గానీ నగదు మార్పిడి జరిగే అవకాశం కనిపించడం లేదు. ఏటీఎంలలో కూడా నగదును కూడా శుక్రవారం వరకు అందుబాటులో తెవొచ్చనే సంకేతాలు కూడా ఇస్తున్నారు.

అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్య త్వరగతినే పరిష్కారం అయ్యేందుకు బ్యాంకులు చొరవతీసుకుంటున్నాయి, నిత్యావసరాలకు సరిపడా మొత్తాన్ని వినియోగదారులకు అందజేసేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New 500 and 2000 notes  Huge Crowd  ATM services  

Other Articles