బాస్ ను చెట్టుకు కట్టేసి.. బట్టలూడదీసి... | Nagpur Lady teaches lesson to Boss

Nagpur lady teaches lesson to boss

Woman Staff sexual Harassment, Woman Employee teach a lesson to Boss, Boss Sexually harassment employees, Lady employee revenge on Boss, Sexual Harassment employee revenge on Boss, Sexual Harassment in Indian Offices

Nagpur Lady employee teaches a lesson to Boss who sexually harassed employees.

కక్కుర్తి బాస్ కి భలేగా బుద్ధి చెప్పిన యువతి

Posted: 11/08/2016 03:57 PM IST
Nagpur lady teaches lesson to boss

ఎన్ని చట్టాలు చేసినా కామ పిశాచాలు రెచ్చిపోతూనే ఉంటున్నాయి. లైంగిక సుఖం కోసం అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇంటా భయటా ఎక్కడా వారికి రక్షణ లేదు. ఇక పని చేసే చోట అంటారా? అస్సలు చెప్పనక్కర్లేదు. తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళా ఉద్యోగినులపై వేధింపులకు పాల్పడేవారు కోకోల్లలు. ధైర్యం చేసేవారు కొందరైతే భయంతో లొంగిపోయి జీవితాలు నాశనం చేసుకునేవాళ్లు కూడా ఉన్నారు.

అయితే ఇక్కడో యువతి మాత్రం తానే రంగంలోకి దిగి ఆ కామాంధుడికి తగిన బుద్ధి చెప్పింది. సినిమాటిక్ గా జరిగిన ఈ ఉదంతం నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. రామ్ లీలా ఏరియా లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా కొత్తగా పనిలో చేరింది 22 ఏళ్ల ఆ యువతి. సహచరుల ద్వారా ఆఫీస్ లో జరిగే లైంగిక వేధింపుల గురించి తెలుసుకుంది. ఏ అమ్మాయిని కూడా వదలకుండా కీచక బాస్ తన ప్రతాపం చూపించటం, మెసేజ్ లతో, అశ్లీల వీడియోలు పంపుతూ తన కోరిక తీర్చాలంటూ వారిని బెదిరించటం. అయినా లొంగకపోతే వారి ఆర్థిక సమస్యలతో ఆటాడుకోవటం లాంటి విషయాలు ఆమెకు తెలిశాయి.

అంతే ఒక్కసారిగా మెరుపు ఆలోచన చేసింది. తనంతట తానుగానే ఆ బాస్ ను ట్రాప్ చేసింది. మెల్లిగా కోరిక తీరుస్తానంటూ ఊరికి అవతల ఉన్న జనా సంచారం ఉండని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ కు వెళ్దామని కోరింది. కళ్లు మూసుకుపోయిన ఏకాంతం కోసం ఎగిరి గంతేసి మరీ ఆ యువతిని తన కారులో ఎక్కించుకుని అక్కడికి వెళ్లాడు. ఆపై ఆ యువతి అసలు ట్విస్ట్ ఇచ్చింది. అతని బట్టలు అన్ని ఊడదీసి ఓపెన్ రొమాన్స్ పేరితో అతన్ని ఓ చెట్టుకు కట్టేసిన యువతి, ఆపై పర్సు, చెయిన్, ఫోన్ లాక్కుని కారుతో సహా ఉడాయించింది.

అయితే భర్త నాలుగు రోజులుగా ఇంటికి రాకపోవటంతో కంగారు పడిన అతని భార్య పోలీసు ఫిర్యాదు చేయగా ఫలితం లేకుండా పోయింది. చివరకు నగరంలోని సిగ్నళ్ల దగ్గరి పలు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా అసలు విషయం పసిగట్టిన పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మొత్తం జరిగిందంతా యువతి చెప్పుకోచ్చింది. వెంటనే ఆ ప్రాంతంలోకి వెళ్లిన పోలీసులు తిండి తిప్పలు లేక సొమ్మసిల్లి పడిపోయిన ఆ వ్యక్తిని రక్షించారు. ఆపై ఆఫీస్ లో పని చేసే తొటివారి సాయంతో తమపై జరుగుతున్న దాష్టీకాల గురించి ఆ యువతి మొత్తం వివరించటంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వాలు తెచ్చే గట్టి చట్టాలు వారిని ఏం చేయలేనప్పుడు, జంకు లేకుండా ముందడుగు వేసి ధైర్యం ఉన్న యువతులు ఉన్నంత కాలం ఇలాంటి మృగాల ఆట కట్టించవచ్చని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagpur  Woman Employee  sexual harassment  revenge  Boss  

Other Articles