జియో ఫోన్లు పేలుతున్నాయ్.. జాగ్రత్త | Reliance Jio 4G SIM supporting LYF smartphone blast in Kashmir.

Reliance jio 4g sim supporting lyf smartphone blast

Reliance Jio 4G phone blast, Reliance Jio Lyf phone blast, smart phones blast in India, Omar Abdullah tweet on Mobile blast, Reliance phones blast, Jio Phones blast, tanvir sadiq phone blast

Another smart phone blast. Now its Reliance Jio 4G SIM supporting LYF smartphone blast in Kashmir. Its happend to tanvir sadiq political secretary of Omar Abdullah's .

అలర్ట్: రిలయన్స్ జియో ఫోన్ పేలిపోయింది

Posted: 11/07/2016 11:09 AM IST
Reliance jio 4g sim supporting lyf smartphone blast

అపరిమిత ఇంటర్నెట్ తో మొబైల్ మార్కెట్ రంగంలో సంచలనాలకు తెరలేపిన రియలన్స్ జియో గురించి రాను రాను ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. నెట్ వర్క్ సమస్యలపై ఇదివరకే విమర్శలు వినిపించగా, తర్వాత కస్టమర్లు పెరిగిపోతుండంటతో నెట్ స్పీడ్ తగ్గిపోతుందని రిలయన్స్ ఓ ప్రకటన చేసింది కూడా. ఇక ఇప్పుడు ఏకంగా ఫోన్లు సైతం పేలిపోతుండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

జమ్ముకశ్మీర్ లోని ఓ వ్యక్తి తన ఇంట్లో లైఫ్ స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనకు సంబంధించి ఫోటోలను ట్విట్టర్ లో ఉంచాడు. కాస్తలో తన కుటుంబం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందని చెబుతూ... తన చేతికి అయిన గాయం కు సంబంధించిన ఫోటోను కూడా ఉంచాడు. అయితే అతను నేషనల్ కాన్పరెన్స్ చీఫ్ అయిన ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత సిబ్బంది కావటం విశేషం. దీంతో ఒమర్ కూడా స్పందించటంతో ఈ వార్త బాగా హైలెట్ అయ్యింది.

తాను సమీప భవిష్యత్తులో ఆ ఫోన్ ను వాడబోనని, మీ కుటుంబ సభ్యులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోవటంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఒమర్ తన సందేశంలో పేర్కొన్నాడు. తన్వీర్ సాధిక్ అనే వ్యక్తి చేసిన ఈ పోస్ట్ పై వెంటనే లైఫ్ సంస్థ కూడా స్పందించింది. 'మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం' అని అందులో పేర్కొన్నారు.

 

 

4జీ తరంగాలను ఉచితంగా అందిస్తూ, శరవేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియోకు ఇది ఖచ్ఛితంగా కాస్త బ్రేకులు వేసే వార్తేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇది వరకు శాంసంగ్ ఫోన్లు పేలుతున్నట్లు పెద్ద కలకలం రేగగా, నోట్ 7 ను విమానాల్లో వాటిని నిషేధించిన విషయం తెలిసిందే. మరోవైపు తన వన్ ఫ్లస్ మొబైల్ పేలిన ఘటనపై ఓ వినియోగదారుడు ఇలాగే సోషల్ మీడియాలో రచ్చ చేయగా, దిగి వచ్చిన కంపెనీ అతనికి మూడు ఫోన్లను గిప్ట్ గా అందించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Lyf Mobile  Blast  Jammu And Kashmir  

Other Articles