ఒబామాకు ప్రేమతో... | Obama Hits Frontline For Clinton

Obama love for votes to clinton

Obama Hits Frontline For Clinton, Obama love for Clinton, Obama love for votes, Obama supports to Hillary Clinton

Obama Hits Frontline For Clinton in Columbus speech.

నా మీద లవ్ ఉందా? అయితే నిరూపించుకోండి

Posted: 11/03/2016 08:36 AM IST
Obama love for votes to clinton

మీకు ఎవరి మీద అయిన ప్రేమ ఉంటే ఎలా నిరూపించుకుంటారు? ఏ బహుమతో, గట్రో ఇచ్చి ఆకట్టుకుంటారు అంతే కదా. కానీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా మాత్రం అలా కాదంట. తనపై అమితమైన ప్రేమ ఉంటే ఆ ఒక్క పని చేయండి చాలూ అంటున్నాడు. ఇంతకీ ఏం పని అంటారా?

అమెరికా అధ్యక్ష బరిలో దిగిన హిల్లరీ క్లింటన్ కు ఓటేయమని. డెమొక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ ను మద్దతిచ్చేందుకు అధ్యక్షుడు ఒబామా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. హిల్లరీ విజయం సాధించి వైట్ హౌస్ లో తన వారసురాలిగా రావాలని భావిస్తున్న ఆయన, తాజా సర్వే ఫలితాలతో కొంత కలవరం చెందినప్పటికీ, ఆ వెంటనే హిల్లరీకి ఓటు వేయాలని తెలిపారు.

ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ, తన మాజీ కార్యదర్శి హిల్లరీకి మద్దతివ్వాలని కొలంబస్ లో జరిగిన ప్రచార సభలో ఆయన అన్నారు. "ఆడవారైనా మగవారైనా ఆమెతో సమానులెవరూ లేరు. నేనైనా, బిల్ క్లింటనైనా... మా కన్నా హిల్లరీకే అర్హతలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చక్కగా అధ్యక్షురాలిగా పనిచేయగలుగుతుంది" అన్నారు. తన కోసం ఏం చేశారో అదే ఇప్పుడు హిల్లరీ కోసం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తనంటే ఇష్టముంటే హిల్లరీకి ఓటేయాలని కోరారు. కాగా, ఈ ఐదు రోజుల పాటు ఒబామా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి హిల్లరీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.

రెండు రోజుల క్రితం విడుదలైన సర్వేకు పూర్తి విరుద్ధంగా నేడు ఇంకో సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ట్రంప్ కన్నా హిల్లరీ 6 పాయింట్ల ముందంజలో ఉన్నారని, ఎఫ్బీఐ ప్రకటనకు పూర్వం ఆమెకెంత పాప్యులారిటీ ఉందో తిరిగి ఇప్పుడు అదే స్థాయికి ఆమె చేరుకున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ, ఐపీఎస్ఓఎస్ డైలీ ట్రాకింగ్ పోల్ తెలియజేశాయి.

తమ పోల్ లో 1,772 మంది పాల్గొన్నారని, వీరిలో 45 శాతం మంది క్లింటన్ కు మద్దతివ్వగా, 39 శాతం మంది ట్రంప్ ను వెనకేసుకొచ్చారని పేర్కొంది. కాగా, రెండు రోజుల క్రితం వెల్లడైన పోల్ ఫలితాల్లో ట్రంప్ 1 పాయింట్ ముందున్నారని తేలడంతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Hillary Clinton  Columbus speech  

Other Articles