నటి సౌందర్య మరణం గురించి అమె తల్లిదండ్రులకు ముందే తెలుసా..? actress soundarya parents aware of her death prior to the accident

Actress soundarya parents were aware of her death prior to the accident

Soundarya, satyanarayana, parents, astrology, areoplane crash, soundarya Death Mystrey, actress Soundarya Death, soundarya Mysterous death, Soundarya Death, south indian actress

south indian actress soundarya parents were aware of her mysterious death, prior to areoplane crash at banglore air port

నటి సౌందర్య మరణం గురించి అమె తల్లిదండ్రులకు ముందే తెలుసా..?

Posted: 11/02/2016 12:12 PM IST
Actress soundarya parents were aware of her death prior to the accident

అందాల నటి సౌందర్య మరణిస్తుందని అమె తల్లిదండ్రులకు ముందే తెలుసా.. అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అయితే అమె విమానం ప్రమాదంలో మరణిస్తారన్న విషయం వారికి ముందే స్పష్టంగా తెలుసునన్న సమాచారం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపి పార్టీలో చేరిన ఈ నటి ఆ పార్టీ తరపున కర్ణాటకలో ముమ్మర ప్రచారం కూడా నిర్వహించింది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంటు నియోజవర్గం నుంచి అప్పట్లో బరిలో నిలిచిన విద్యాసాగర్ రావు.. (ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్) తరపున ప్రచారం నిర్వహించేందుకు బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరగా అమె విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

నటిగా దక్షిణ భారత దేశంలో మంచి ప్రేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కన్నడ అమ్మాయి.. పక్కింటి అమ్మాయిలో కొందరిని మెప్పించగా, తమ అడపడచుగా ఎందరో మహిళా ప్రేక్షకుల హృధయాలను హత్తుకుంది. దక్షిణాది ప్రేక్షకులను అలనాటి సావిత్రి తరహాలో కట్టిపడేసిన అభినయం అమె సోంతం. అంతేకాదు ఇటు భారతీయ సంప్రదాయానికి, అటు పాశ్చాత ఫాషన్ దుస్తుల్లోనూ మెరిసినా.. అమె అందానికి తోడు అభినయంతో హద్దులు మీరని ఎక్స్ ఫోజింగ్ తో అబాలగోపాలాన్ని కట్టిపడేసిందనడం అతిశయోక్తి కాదేమో.

అయితే అలాంటి సౌందర్య గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ చర్చ ఊపందుకుంది. అమె తల్లిదండ్రులకు అమె విమాన ప్రమాదంలో మరణిస్తుందన్న విషయంలో ముందుగానే తెలుసునని కూడా ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణాలను కూడా సోషల్ మీడియాలో విశ్లేషించుకోవడం కోసమెరుపు. ఇంతకీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న మేరకు సౌందర్య తండ్రి సత్యనారాయణకు జాతకలపై మంచి పట్టువుందని, దాంతోనో అమె ఇటు దక్షిణాధి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకుని అగ్రనటి స్థానాన్ని కూడా పోందుతుందని తెలుసుకున్నారట.

దీంతో పాటు 2004లో అమె సినీకెరీర్ ముగుస్తుందని స్పష్టంగా అయన అంచనా వేశారట. అయితే అమె జీవితం ముగుస్తుందని మాత్రం ఆయన భావించలేదట. కెరీర్ మార్చుకునేందుకు అమెను రాజకీయ అరంగ్రేటం చేయించాలని భావించారట. తండ్రి సూచనల మేరకే అమె కర్ణాటక రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఉబలాట పడిందని సమాచారం. అందకు అనుగూణంగానే అమె ప్రచారం చేసి, 2004 ఏప్రిల్ 17 న ఏపీలో ప్రచారానికి వస్తూ విమానం ఎక్కగా, రన్ వేపై సాంకేతిక లోపంతో మంటలంటుకుని అందులో ప్రయాణిస్తున్నవారందూ అగ్నికి అహుతైన విషయం పాఠకులకు తెలిసిందే. దీంతో అమె అభిమానులతో పాటు సినీ అభిమానులకు కూడా విషాదంలోకి మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soundarya  satyanarayana  parents  astrology  areoplane crash  soundarya Death Mystrey  

Other Articles

Today on Telugu Wishesh