అన్నీ పెద్ద తలలనే లేపేశారు | Top Most Maoist Leaders Killed In AOB Encounter

Major operation against ultras at aob

Top Most Maoist Leaders Killed In AOB Encounter, Major operation against ultras, 24 Maoists gunned down.

Major operation against ultras, 24 Maoists gunned down. Top Most Maoist Leaders Killed In AOB Encounter

పెద్ద తలకాయల కోసమే పక్కా స్కెచ్! మృతుల్లో ఎవరున్నారంటే...

Posted: 10/24/2016 04:35 PM IST
Major operation against ultras at aob

ఏవోబీ(ఆంధ్రా ఒడిశా బార్డర్) లో జరిగిన ఎన్‌కౌంటర్‌ మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 24కు చేరింది. అటవీప్రాంతం చిత్రకొండ, జెంత్రీ మధ్యలో బూసుపట్టి ఏరియాకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఏపీ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. రాత్రి విశాఖ జిల్లాలోని ముంచింగుపట్టి ప్రాంతంలో సెల్ సిగ్నల్స్‌ను నిలిపివేశారు.

ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల్లో పలువురు మావో అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మృతి చెందిన వారిలో గాజర్ల రవి, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్, మున్నాలను గుర్తించారు. మావోయిస్టు అగ్రనేత కొడుకే మున్నా అని సమాచారం. గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మల్కన్‌గిరి, కోరాపుట్, విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ ఎన్ కౌంటర్ వెనుక 2008 నుంచి పోలీసుల్లో రగులుతోన్న ప్రతీకారేచ్చ ప్రధాన కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 2008జూన్ నెలాఖరున విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్ లో లాంచీలో ప్రయాణిస్తోన్న పోలీసులపై రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు మావోయిస్టులు. ఈ దాడిలో లాంచీ డ్రైవర్ సహా మొత్తం 38మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులను అణిచేయాలని చూస్తోన్న పోలీసు యంత్రాంగానికి ఈ దాడి మింగుడుపడలేదు. దీంతో అప్పటినుంచి ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న పోలీసులు.. తాజా దాడి ద్వారా తమ ప్రతీకారం తర్చుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇప్పటికే పలు పోలీసు ఎన్ కౌంటర్ల నుంచి సురక్షితంగా తప్పించుకున్న ఆర్కే లాంటి మావోయిస్టు అగ్రనేత తాజా దాడిలోను తప్పించుకోవడం పోలీసులను కలవరపెడుతోన్న అంశం.

పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌తో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా ఎన్‌కౌంటర్‌ విషయాన్ని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. పక్కా సమాచారంతో ఏపీ, ఒడిశా, కేంద్ర బలగాలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోపక్క కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ హబీబ్ భాషా మృతి చెందినట్లు సమాచారం. మరో కానిస్టేబుల్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మల్కాన్ గిరి ప్రభుత్వాసుపత్రిలో మావోల దేహాలకు పోస్ట్ మార్టం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles