విమానం బాత్ రూంలో బట్టలేకుండా ఎయిర్ హోస్టెస్ ను... | Man strips on IndiGo flight misbehaves with cabin crew

Man strips on indigo flight misbehaves with cabin crew

Man strips on IndiGo flight misbehaves, IndiGo flight misbehaves with cabin crew, man air hostess, air hostess molested, man in flight bathroom

Man strips on IndiGo flight misbehaves with cabin crew arrested.

బట్టలు విప్పేసి ఎయిర్ హోస్టెస్ ను బాత్రూంలోకి పిలిచి...

Posted: 10/12/2016 11:36 AM IST
Man strips on indigo flight misbehaves with cabin crew

విమానంలో ఎయిర్ హోస్టెస్ తో అసభ్యకర ప్రవర్తన చేసిన ఓ ప్రయాణికుడికి పోలీసులు సర్ ప్రైజ్ షాకిచ్చారు. భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు. బట్టలు విప్పేసి నీచంగా ప్రవర్తించాడు.

తొలుత విమానం ఎక్కగానే తనకు సీటు బెల్టు పెట్టుకోవడం రాదని అనడంతో, ఎయిర్ హోస్టెస్ వచ్చి అతడికి సాయం చేసింది. ఆ సమయంలో ఆమెతో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. అయితే అనవసరంగా గొడవ ఎందుకని ఆమె సైలెంట్ గా వెళ్లిపోయింది. ఆపై బాత్ రూమ్ కి వెళ్లిన అతను, అక్కడ ఉన్న కాలింగ్ బెల్ నొక్కి, సిబ్బందిని పిలిచాడు. దీంతో, అక్కడకు వెళ్లిన ఎయిర్ హోస్టెస్ షాక్ అయింది. బట్టలన్నీ విప్పేసి చాలా అభ్యంతరకర పరిస్థితిలో అతను కనిపించాడు. దీంతో, లోపలకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది.

కాస్త గౌరవప్రదంగా వ్యవహరించాలని విమాన సిబ్బంది అతడికి సర్ధి చెప్పే యత్నం చేశారు. ఆ తర్వాత కూడా అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు. విమానం దిగేటప్పుడు కూడా మహిళా సిబ్బందిపై దుర్భాషలాడాడు. దీంతో, విమాన కెప్టెన్ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశాడు. ఈ నేపథ్యంలో, సదరు ప్రయాణికుడు విమానం దిగగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో ఓ ఎయిర్ హెస్టెస్ సెల్పీ దిగాలంటూ వేధించి అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indigo Flight  man misbehave  crew  arrested  

Other Articles