దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. కిటకిటలాడుతున్న అలయాలు Dussera celebrations started nation wide, devotees throng to temples

Dussehra celebrations started india wide devotees throng to temples

Dussehra celebrations, india wide celebrations, kolkata mahakali temple, vijayawada kanakadurga temple, indrakeeladri, aluru jogulamba temple, astadasha peetam temples, temples devotees.

Dussehra celebrations started india wide, from kolkatta kali to vijayawada kanakadurga all astadasha peetam along with other temples thronged with devotees.

దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. కిటకిటలాడుతున్న అలయాలు

Posted: 10/01/2016 09:24 AM IST
Dussehra celebrations started india wide devotees throng to temples

దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వున్న అమ్మావారి అష్టాధశ పీఠాలతో పాటు పలు ఫుణ్యక్షేత్రాలలో కూడా అమ్మావారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి, ఇక పలు దేవాలయాలు, కాలనీల్లో కూడా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాలు చేసి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మావారి ఆలయాలతో పాటు మిగతా అలయాలకు భక్తులు పోటెత్తారు. అమ్మావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉత్తారాధి రాష్ట్రాలలో నాలుగు రోజుల కిందటే ఉత్సవాలు ప్రారంభమైనా.. అమ్మావారికి శరన్నవరాత్రులు మాత్రం ఇవాళ్లి నుంచే ప్రారంభమయ్యాయి, చారిత్రక నేపథ్యంతో పాటు పురాణ ఇతాహాసం నెలకోన్న మైసూరులోనూ అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా అమ్మవారి ఉత్సవాలు కన్నుల పండువగా సాగనున్నాయి, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఇవాళ స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఈ ఉదయం 8 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. కనదుర్గమ్మను నేడు మంత్రి దేవినేని ఉమ దర్శించుకోనున్నారు. కాగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని పలు దేవాలయాలు ఈ ఉదయం నుంచే కళకళలాడాయి. ‘అమ్మ’ దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాలను సుందరంగా అలంకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles