కన్నపేగును మరిచిపోయి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు | Sri Lankan cruel mother and Overdosed mother fall videos viral

Srilankan cruel mother and overdosed mother fall videos viral

Sri Lankan cruel mother, Mother beat Daughter for refuse Bath, Overdosed mother fall down, Baby try to awake children, drug addicted mother, Drug mother baby crying video, Mother Baby video, Mother harassment, Mother Torture Video

Sri Lankan cruel mother and Overdosed mother fall sown in a store videos viral.

ITEMVIDEOS:మదర్ సెంటిమెంట్ ను మరిచిపోయి మరీ...

Posted: 09/27/2016 11:31 AM IST
Srilankan cruel mother and overdosed mother fall videos viral

ఈ లోకంలో అమ్మ ప్రేమను మించింది మరోకటి లేదు. అందుకే మాతృత్వం దేవుడిచ్చిన వరంలా భావిస్తుంటారు. అందు కోసం ఎంతో మంది తల్లులు నోములు, పూజలు చేస్తారు.. కానీ, కన్నపేగు అన్న విషయాన్ని మరచి ఇప్పటి తల్లులు చేస్తున్న వ్యవహారాలు సమాజాన్ని విస్తూపోయేలా చేస్తున్నాయి. చిన్నతనంలో చితకబాదటం దగ్గరి నుంచి పెద్దయ్యాక వారిని వేశ్య గృహాలకు అమ్మటం లాంటి ఉదంతాలు ఈ మధ్య మనం చూశాం. తాజాగా ఓ ఇద్దరు తల్లుల నిర్వాకం వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి.

స్నానం చేయలేదని ఓ తల్లి కూతురిని చితకబాదిన ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. జాఫ్నాకు చెందిన ఓ మహిళ తన కూతురిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని లాక్కొచ్చింది. చెవులు పిండుతూ అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. పెద్ద కర్ర తీసుకుని వీపుపై బాదింది. అయినా కూడా ఆమె కసి తీరలేదు.

 

 

పక్కనే ఉన్న పిల్లాడి చేతిలో కత్తి చూసింది. ఆ క‌త్తితో కూడా వీపుపై కొట్టి… తర్వాత జుట్టు పట్టుకుని ఈడ్చి నేలపై పడేసింది. తలకు షాంపు పెట్టి కసి తీరా రుద్దుతూ తన కోపాన్ని తీర్చుకుంది. ఈ వీడియోలో నెట్ లో అప్ లోడ్ కాగా, క్రూర‌త్వానికి నిద‌ర్శ‌న‌మంటూ ఆ తల్లి చేసిన పనిపై పలువురు మండిపడ్డారు. చివరకు చిన్నారిని హింసించిన ఆ తల్లిని కటకటాల వెనక్కి నెట్టారు.

ఇక మరో ఘటనలో మత్తుకు బానిసైన ఓ తల్లి లోకాన్ని పట్టించుకోకుండా పడిపోవటం, ఆ చిన్నారిని తల్లిని తడుతూ లేపేందుకు ప్రయత్నించడం పలువురిని కంట తడి పెట్టిస్తోంది. లారన్స్ అనే ప్రాంతంలో ఫేమిలీ డాలర్ స్టోర్ అనే సూపర్ మార్కెట్ ఉంది. 36 ఏళ్ల మహిళ తన రెండేళ్ల బిడ్డతో ఆ స్టోర్ కి వచ్చింది. ఆమెకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసింది. అనంతరం ఉన్నపళంగా కుప్పకూలిపోయింది.

 

అయితే ఆమె తీసుకున్న డ్రగ్స్ కారణంగా ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఇక తల్లి అలా పడిఉండటం చూసి ఆ రెండేళ్ల కూతురు, తల్లిని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఓ వైపు ఏడూస్తూనే తల్లిని లేపే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు అక్కడున్న కొందరు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి, బంధువులకు చిన్నారిని అప్పజెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mother  Torture  Babies  Viseos  

Other Articles