డబుల్ బెడ్ రూంపై సోయి లేకుండా మాట్లాడిండా? | KCR sorry to Mid Maneru people for Double Bed room scheme

Kcr sorry to mid maneru people for double bed room scheme

KCR Mia Maneru Double Bed Room Scheme, Telangana Double Bed room Scheme, KCR Dream Scheme shelved, KCR sorry to Mid Maneru people, KCR double bedroom scheme

KCR sorry to Mid Maneru people for Double Bed room scheme.

డబుల్ బెడ్ రూంపై కేసీఆర్ కి అవగాహాన లేదా?

Posted: 09/27/2016 09:21 AM IST
Kcr sorry to mid maneru people for double bed room scheme

కేసీఆర్ ఎంతో ఇష్టంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ప‌థ‌కం ఇప్పుడు ఆయన్ని చిక్కుల్లో పడవేసింది. నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, దరఖాస్తులు మాత్రం వేలలో వస్తున్నాయి. మరోవైపు నేతల రికమండేషన్లు తోడు కావటంతో ఎవరికి మంజూరు చేయాలో తెలియక అధికారులు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఈ దశలో సోమవారం మిడ్ మానేరు పర్యటన సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇంకాస్త ఇరకాటంలో పెట్టేశాయి.

గతంలో వేములవాడ పర్యటన సందర్భంగా అక్కడి మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని స్వయంగా కేసీఆరే హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అది నిలబెట్టుకునే అవకాశం లేదంటూ ఆయనే క్షమాపణలు కోరాడు. నిర్వాసితులకు ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీలో ఇళ్లు మంజూరు చేసినందున డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసే పరిస్థితి లేదని వివరించారు. ఇందుకు తనను క్షమించాలని కోరారు. ప్రస్తుతం కొత్తగా భూసేకరణ చేస్తున్న ప్రాంతంలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు.

‘‘ఆ రోజు అవగాహన లేకపోవడం వల్లే డబుల్ బెడ్రూం హామీ ఇచ్చా. మిడ్ మానేరు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కింద ఇళ్లు మంజూరు చేశాం. కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఆడిట్‌లో సమస్యలు వస్తుండడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చే అవకాశం లేదు’’ అని కేసీఆర్ వివరించారు. నిర్వాసితులు పెద్దమనసుతో తనను అర్థం చేసుకుని క్షమించాలని కోరారు. అయితే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక భూసేకరణ చేస్తున్న ప్రాంతంలో నిర్మాణానికిగానూ వ్యయాన్ని ‘డబుల్’ చేస్తేకానీ కాంట్రాక్టర్లు.. ఇళ్ల సంఖ్యను పెంచితేకానీ ప్రజాప్రతినిధులు పనులపై ఆసక్తి చూపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం రాష్టవ్య్రాప్తంగా ఈ ఏడాది దాదాపు 2లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకోగా, ఇందులో లక్ష ఇళ్లను ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇంటికి రూ. 7 లక్షల వరకు, అంతకన్నా ఎక్కువ అంతస్తుల్లో తొమ్మిది అంతస్తుల వరకు నిర్మించే ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ. 90వేలు అంటే రూ. 7.90 లక్షలుగా నిర్ణయిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీలతోపాటు, ఇప్పుడు చేస్తున్న మార్పుల ప్రకారం ఇళ్లులు నిర్మించాలంటే వ్యయం తడిసి మోపెడు అవుతుంది. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్‌కు ఓట్ల వ‌ర్షం కురిపించిన ఈ స్కీంతో అనవసరమైన హామీలతో ఇప్పుడు తలలు పట్టుకోవటం ప్రభుత్వం వంతు అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  CM KCR  Mid Maneru  Double Bed Room scheme  

Other Articles