ముద్రగడ మోసం చేసి తుని విధ్వంసం చేశాడా? | news channel owner investigation in Tuni arson

News channel owner investigation in tuni arson

Number 1 news channel owner Sudhakar Naidu, News Channel MD in Tuni Arson, Sudhakar Naidu investigation in Tuni arson, Mudragada Sudhakar Naidu, Sudhakar Naidu Mudragada, Mudragada Tuni Arson, Mudragada Cheating,

Number 1 news channel owner Sudhakar Naidu investigation in Tuni arson.

తుని సభలో ముద్రగడ పెద్ద మోసం చేశాడా?

Posted: 09/20/2016 10:23 AM IST
News channel owner investigation in tuni arson

తుని ఘటనపై నమోదైన కేసులో నంబర్ వన్ న్యూస్ చానెల్ యజమాని మంచాల సుధాకర్ నాయుడును సీఐడీ సోమవారం రాజమహేంద్రవరంలో విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుధాకర్ ముద్రగడపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘చలో కాపునాడు’కు ముందుకు తనను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలిశారని, దీంతో మీడియా పరంగా ఆయనకు తాను సహకరించేందుకు ముందుకు వచ్చానని తెలిపాడు. నాటి సభా వేదికపై ఒకరి తర్వాత మరొకరు మాట్లాడదామని ముందుగా చెప్పిన పద్మనాభం ఆపై మొత్తం ఆయనే మాట్లాడినట్లు వివరించాడు.

సభకు వచ్చినవారిని ముద్రగడ రెచ్చగొట్టారని, సభలో వినియోగించిన డ్రోన్ కెమెరాలను హైదరాబాద్ నుంచి తెప్పించారని సీఐడీ విచారణలో తెలిసింది. దీనిపై డ్రోన్ కెమెరాలను హైదరాబాద్‌లోనే కొనుగోలు చేశారని, వాటిని ముద్రగడ కుమారుడే ఆపరేట్ చేశారని సుధాకర్ వెల్లడించాడు. అయితే వాటిని స్పాన్సర్ చేసింది మాత్రం ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. అలాగే వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఎటువంటి సాయం అందించారో కూడా తనకు తెలియదని పేర్కొన్నట్టు సమాచారం.

కాపుల కోసం ఉద్యమమంటే తాను వెళ్లానని, మాట్లాడేందుకు ఒక్కొక్కరినీ ఆహ్వానించిన ముద్రగడ తర్వాత పట్టాలపైకి రావాలంటూ పిలుపు ఇవ్వడంతో తాను కూడా ఆశ్చర్యపోయానని సుధాకర్ వివరించాడు. రైలును తగలబెట్టాలన్న ఉద్దేశం యువకులకు లేదని, వారిని రెచ్చగొట్టడం వల్లే ఈ పనికి పాల్పడ్డారని వెల్లడించాడు. ఈ గొడవలో తనకు గాయాలు అయితే చూసేందుకు ముద్రగడ రాలేదని సుధాకర్ నాయుడు సీఐడీ అధికారుల ముందు వాపోయినట్టు తెలుస్తోంది. కాగా, డ్రోన్ కెమెరాలు అందించిన వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, మంచాల సాయి సుధాకర్ నాయుడు స్వస్థలం గుంటూర్ జిల్లా రేపల్లె. గతంలో పోలీస్ శాఖలో మమూలు కానిస్టేబుల్‌గా ఉండి ఆ శాఖలో సస్పెండ్ అయ్యాడు. ఆపై రాజకీయాలపై ఆసక్తితో ప్రజారాజ్యం పార్టీలో చేరి, కొన్నాళ్ల తర్వాత ఆ పార్టీలో నుంచి బ‌యటకి వచ్చాడు. విదేశాల నుంచి వ‌చ్చిన భారీ డబ్బుతో న్యూస్ ఛానల్ పెట్టారంటూ గాసిప్స్ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో కుల పెద్దలకు మద్ధతు ఇచ్చాడన్న ప్రచారం కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada  Tuni Arson  Sudhakar Naidu  CID investigation  

Other Articles