తన సమాధి తానే నిర్మించుకున్న మహిళ | Woman constructs her own tomb in Tamil Nadu

Woman constructs her own tomb in tamil nadu

Tamil Nadu Woman constructs her own tomb, own tomb construction, tomb construction, self tomb, Rosy tomb, Kanyakumari woman own tomb

Tamil Nadu Woman constructs her own tomb.

బతికుండగానే ఆ పెద్దావిడకు సమాధి కడుతున్నారు

Posted: 09/09/2016 09:23 AM IST
Woman constructs her own tomb in tamil nadu

తమిళనాడులోని కన్యాకుమారి సూలల్ పంచాయతీ పరిధిలోని పల్లకుజి మెలవిల్లై గ్రామం జనాలంతా తండోపతండాలుగా తరలివస్తున్నారు. విషయం తెలుసుకున్న టీవీ చానెళ్లు ఆసక్తిగా ఆ గ్రామానికి వెళ్లాయి. వారంతా ఓ స్మశానంపైపు పరిగెడుతుండటంతో వారిని ఫాలో అయ్యాయి. అక్కడ ఓ 55 ఏళ్ల వృద్ధురాలు స్మశాన వాటికలో తాపీగా కూర్చుని ఉంది, పక్కనే గ్రానైట్ రాళ్లతో ఓ అందమైన సమాధి నిర్మాణం జరుగుతోంది. పాపం ఎవరు పోయారో? ఏం జరిగిందో? అని ఆరాతీసిన మీడియాకు పెద్ద షాకే తగిలింది. అది ఆవిడగారి కోసమే...

అపీయన్ అనే వ్యక్తి ఒకప్పుడు ఆ గ్రామానికి పెద్దదిక్కుగా ఉండేవాడు. ఆయనకు ఆరుగురు సంతానం. అందులో ఒకరే ఈ రోజీ. అయితే తన వారంత చనిపోవటం, ఆమె పెళ్లి కూడా చేసుకోకపోవటంతో ఒంటరిగా మిగిలిపోయింది. స్థానికంగా జీడి తోటల్లో పనిచేస్తూ జీవిస్తోంది. వచ్చిన సంపాదనలో కొంత పొదుపు చేసి ఏడు సెంట్లలో ఓ గది నిర్మించుకుని అందులో ఉంటోంది.

‘‘నీకంటూ ఎవరూ లేరు. ఎందుకంతలా కష్టపడతావు. నీవు చనిపోయాక అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా ఎవరూ లేరు కదా’’ అని ఇరుగుపొరుగువారు రోజీని ప్రశ్నించడంతో నిజమే అనుకున్న ఆమె వెంటనే పనిమానేసి కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ(ఎంఎన్ఆర్ఈజీఎస్)లో చేరింది.

నిజమే తనకు ఎవరూ లేరు కదా. మరి తాను చనిపోతే అంతిమ సంస్కారాలు చేసేది ఎవరు? అన్న ఆలోచనే ఆమెతో ఇలా సమాధిని నిర్మించేలా చేసింది. తాను చనిపోయాక ఎవరికీ భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెబుతోంది. నెల రోజుల క్రితం సమాధి నిర్మాణ పనులు చేపట్టింది. గ్రానైట్ రాళ్లతో అందంగా సమాధిని నిర్మించుకుంది. అంతేకాదు తన ఫొటో, పేరు, వివరాలతో ఓ ఫలకాన్ని కూడా సమాధి పైభాగంలో సిలువ కింద అమర్చింది.

తాను చనిపోయాక ఇందులో సమాధి చేయడం చాలా సులభమైన పని అని, తలవైపు ప్రాంతంలో చిన్న గొయ్యి తవ్వడం ద్వారా మృతదేహాన్ని సులభంగా అందులోకి చేర్చవచ్చని రోజీ చెబుతోంది. ఇప్పుడీ సమాధి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల వారు తరలివస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  woman  own tomb  

Other Articles