జనసేన కాకినాడ ఆత్మగౌరవ సభ | All eyes on Pawan Kalyan ahead of his public meeting in Kakinada

All eyes on pawan kalyan ahead of his public meeting in kakinada

Janasena Andhrula Athma Gaurava Sabha, Janasena Kakinada meeting, Andhrula Athma Gaurava Sabha, pawan in kakinada sabha, janasena public meeting in Kakinada, kakinada Janasena meeting

All eyes on Pawan Kalyan ahead of his public meeting in Kakinada.

పవన్ ఆత్మగౌరవ సభ ఏంటీ పరిస్థితి?

Posted: 09/08/2016 12:41 PM IST
All eyes on pawan kalyan ahead of his public meeting in kakinada

నవ్యాంధ్ర ప్రత్యేక హోదా అంశం పూర్తిగా పాడెక్కి, కేవలం స్పెషల్ ప్యాకేజీతోనే సరిపెట్టేస్తున్న కేంద్ర వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు ఆర్థిక సాయం గురించి పూర్తిగా విన్నాక, ఆపై హోదా గురించి అడుగుదామని అధికార పక్షం చెబుతుండగా, అలా కుదరదని, సర్వరోగ నివారిణి స్పెషల్ స్టేటస్ అన్న చందాన విపక్షాలన్నీ కలిసి ఏపీని అట్టుడికేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయి పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదంటే ప్రతిపక్షాలు ఎంత మొండి వైఖరితో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా అర్థంతరంగా కేంద్రం ప్రకటన చేయటం వెనుక పవన్ సభ ఉండటమే కారణమన్న బలమైన వాదన ఉంది. జనసేన ఆధ్వర్యంలో కాకినాడ వేదికగా రేపు ( సెప్టెంబర్ 9, శుక్రవారం) ఆంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. తిరుపతి సభలోనే పవన్ ఈ విషయం ప్రకటించడం, ఆపై డ్యామేజ్ ముందుగానే ఊహించిన చంద్రబాబు ఆదేశించడటంతో కదలిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మరో ఎంపీ కొనకళ్ల విరామం లేకుండా చర్చలు జరిపి చివరకు కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ పై సూత్ర ప్రాయ ప్రకటన చేయించారన్నది ఇట్టే అర్థమైపోతుంది.

తద్వారా జనసేన సభ ద్వారా పవన్ చూపించే ఇంపాక్ట్ ను కొంతమేర అయినా తగ్గించవచ్చనేది అటు బీజేపీ, ఇటు టీడీపీ వేసిన ఫ్లాన్. ఇది బాగానే ఉన్నప్పటికీ, చేసే ఆర్థిక సాయం విషయంలో కూడా క్లియర్ ప్రకటన చేయకపోవటం, వివరాలను సంబంధిత సైట్లో పెడతామంటూ జైట్లీ చెప్పటంతో అంశంపై కాస్త గందరగోళం నెలకొంది. దీంతో కేంద్రం నుంచి ఎటుకానీ ప్రకటన రావటంతో ఆత్మగౌరవ సభ జరిపి తీరాలన్న ఆలోచనలోనే జనసేన ఉంది. ఈ మేరకు జేఎన్టీయూ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఈ సభ వేదికగా పవన్ ఓవైపు ప్రత్యేక ప్యాకేజీపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఇంకోవైపు ఆంధ్రుల హక్కుగా భావిస్తున్న హోదా అంశంపై నినదించే అవకాశం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kakinada  Pawan Kalyan  Janasena  meeting  Andhrula Athmagaurava Sabha  

Other Articles